వేసవి బరిలోకి 'ఏంజెల్'

Published : Apr 08, 2017, 01:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
వేసవి బరిలోకి 'ఏంజెల్'

సారాంశం

వేసవి బరిలోకి 'ఏంజెల్' నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతున్న ఏంజెల్

శ్రీ సరస్వితి ఫిల్మ్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సినిమా 'ఏంజెల్'. యంగ్ హీరో నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి శిష్యడు బాహుబలి పళని చిత్ర సీమకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తన గురువు రాజమౌళి రూపొందించిన విజువల్ వండర్ బాహుబలి 2, వేసవి కానుకగా విడుదల కాబోతున్న నేపథ్యంలో బాహుబలి పళని సైతం ఏంజెల్ ని వేసవి బరిలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

మే రెండో వారంలో ఏంజెల్ విడుదలకి సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. ఇక గతంలో దర్శకులుగా మారిన రాజమౌళి శిష్యులు ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకులేదు. అయితే బాహుబలి పళని రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకం నిర్మించడం. అలానే ప్రముఖ నిర్మాత సింధూరపువ్వ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో ఏంజెల్ నిర్మాణం జరగడంతో ఈ సినిమా పై ట్రేడ్ వర్గాల్లో అంచనాలు నెలకొన్నాయి.

 

ఇక సినిమాలో ఉన్న గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, కామెడీ, ఎమోషనల్ సీన్స్, నాగ అన్వేష్, హెబ్బాపటేల్ మధ్య నడిచే లవ్ ట్రాక్ అలానే భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్, గుణ సినిమాటోగ్రఫి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని భువన్ తెలిపారు. ఇటీవలే సప్తగిరి ఎక్స్ ప్రెస్ మూవీతో హీరోగా మారిన స్టార్ కమీడియన్ సప్తగిరి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలానే ప్రముఖ హిందీ నటుడు కబీర్ సింగ్ తో పాటు ప్రదీప్ రావత్, షియాజీ షిండే ఈ సినిమాలో ప్రతినాయకులుగా నటిస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు నెలకొన్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్