
అల్లరి నరేష్ రూటు మార్చి.. సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. కామెడీ హీరోగా ఆఫ్ సెంచరీ కొట్టిన ఆయన.. ఆతరువాత సీరియస్ పాత్రల వైపు మళ్ళారు. ఒక వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే.. మరో వైపు హీరోగా కొనసాగుతున్నారు. ఈక్రమంలో ఆయన తాజాగా నటిస్తోన్న సినిమా నా సామిరంగ. నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ఈసినిమాలో నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈసినిమా విజయ్ బిన్నీ దర్శకత్వం లో తెరకెక్కుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా నా సామిరంగ తెరకెక్కుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నెలలో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రం లో అల్లరి నరేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం లో అల్లరి నరేష్ అంజి పాత్రలో ఆడియెన్స్ ను అలరించనున్నారు.
ఈపాత్ర కి సంబందించిన ఇంట్రో గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ వీడియో లో అల్లరి నరేష్ ఎనర్జిటిక్ గా కనిపించారు. కింగ్ నాగార్జున తో కాంబినేషన్ సీన్లు బాగున్నట్టు తెలుస్తోంది. మరోసారి అల్లరి నరేష్ తనదైన మార్క్ ను ఈ అంజి పాత్రతో వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, అషికా రంగనాథ్ లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.