యంగ్ డైరెక్టర్ తో ఘనంగా నటుడు ప్రభు కూతురు ఐశ్వర పెళ్లి, స్టార్స్ ఎవరెవరు వచ్చారంటే..?

Published : Dec 15, 2023, 11:05 AM IST
యంగ్ డైరెక్టర్ తో ఘనంగా నటుడు ప్రభు కూతురు ఐశ్వర పెళ్లి,  స్టార్స్ ఎవరెవరు వచ్చారంటే..?

సారాంశం

ప్రముఖ తమిళ నటుడు.. నడిగరతిలకం  దివంగత శివాజీ గణేషన్ మనవరాలు.. లెజెండరీ నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్య వివాహ ఘనంగా జరిగింది. ప్రముఖ తమిళ యువ దర్శకుడితో ఆమె మూడుముళ్ళు వేయించుకున్నారు.  

తమిళ యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌ను వివాహం చేసుకున్నారు తమిళనటుడు ప్రభు కుమార్తె. చెన్నైలో  వీరిపెళ్ళి ఘనంగా జరిగింది. ఇక వీరిద్దరు ప్రేమించుకుంటున్నట్టు గతంలోనే  వార్తలు వచ్చాయి.  ఈ ఇద్దరు స్టార్ల పెళ్ళితో ప్రభు, ఆదిక్‌ రవిచంద్రన్‌ల కుటుంబ సభ్యులు సంబరాల్లో మునితి తేలుతున్నారు. ఇక వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ప్రముఖ తమిళ దివంగత నటుడు శివాజీ గణేషన్ మనవరాలు ఐశ్వర్య. 

ఆదిక్, ఐశ్వర్యల వివాహం ఈరోజు( 15 డిసెంబర్) ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ వివాహానికి  హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు  ప్రముఖ నటుడు విశాల్. అధిక్ రవిచంద్రన్, ఐశ్వర్యల వివాహానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. 

రీసెంట్ గా విశాల్ హీరోగా అధిక్ రవిచంద్రన్  ఓ సినిమాను తెరకెక్కించారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన మార్క్ ఆంటోని సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు 100 కోట్ల క్లబ్‌లో చేరింది. తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడి పెళ్ళి కావడంతో.. విశాలో పెళ్లి మండపంలో సందడి చేశారు. విశాల్ తో పాటు తమిళ ఇండస్ట్రీకి చెందిన..పలువురు ప్రముఖులు ఈ పెళ్ళిలో సందడి చేశారు. 

ఇక ప్రభు కూతురు ఐశ్వర్య విషయానికి వస్తే.. ఆమెకు గతంలోనే పెళ్ళి జరిగింది. అధిక్ ను రెండో వివాహం చేసుకున్నారుఐశ్వర్య. ఆమె పెళ్ళి  కునాల్‌ అనే యువకుడితో  2009లో జరగగా... కొన్నేళ్లకే వీరి మద్య మనస్పర్థలు వచ్చి వీరి బంధం విడాకులతో ముగిసింది. దీని తరువాత, ఐశ్వర్య తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఇక  కొన్నేళ్లుగా ఆమె  దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో డేటింగ్ చేస్తూ వస్తోంది. ఫైనల్గా ఇరువురు కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరు వివాహం చేసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?