సినీపరిశ్రమలో విషాదం, నటుడు, దర్శకుడు శంకరన్ కన్నుమూత.

Published : Dec 15, 2023, 12:07 PM ISTUpdated : Dec 15, 2023, 12:10 PM IST
సినీపరిశ్రమలో విషాదం, నటుడు, దర్శకుడు శంకరన్ కన్నుమూత.

సారాంశం

గత కొద్ది కాలంగా ఫిల్మ్ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. భాషతో సబంధం లేకుండా సినిమా తారలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. ఈక్రమంలో తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకిచెందిన మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు శంకర్ కన్నుమూశారు. 

భాషతో సబంధం లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు తిరిగిరాని లోకాలకు వెళ్ళి పోతున్నారు. ఇప్పటికే విశ్వనాథ్, చంద్రమోహన్, శరత్ బాబు, తమిళంలో  మరికొందరు నటులు మరణించగా.. తాజాగా మరోక నటుడు కన్నుమూశారు. తమిళ సినీ పరిశ్రమలో ఆయన మరణంతో తీవ్ర  విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, దర్శకుడు ఆర్.శంకరన్ కన్నుమూశారు. ఆయన వయసు  ప్రస్తుతం 93 సంవత్సరాలు. 

వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల  తమిళ పరిశ్రమ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. శంకరన్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు. ఎందరో టాలెంటెడ్ వ్యాక్తులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు శంకరన్.  ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఈయన శిష్యుడే. తన గురువు మృతి పట్ల భారతీరాజా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 

1962లో విడుదలైన 'ఆడి పేరుకు' చిత్రం ద్వారా శంకరన్ సినీ పరిశ్రమకు నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. 1999లో చివరిసారిగా 'అళగర్ సామి' చిత్రంలో నటించారు. 1974లో 'ఒన్నే ఒన్ను కన్నె కన్ను' చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

 

PREV
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?