ప్రముఖ నిర్మాత నవీన్ యెర్నెనీ (Naveen Yerneni) ఇంట్లో మూడు రోజులుగా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో నే ప్రొడ్యూసర్ నవీన్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నెని (Naveen Yerneni) తాజాగా అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రే ఆయన కాస్తా ఆరోగ్యం ఇబ్బందిగా అనిపించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన నవీన్ కు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే నవీన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిందేదీ లేదని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.
మూడు రోజులుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు అయిన నవీన్ యెర్నేని, రవిశంకర్ ఇళ్లతో పాటు, టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఇంటిలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా వీరి ఇండ్లలో ఆఫీసర్లు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఈక్రమంలో నవీన్ యెర్నేని అస్వస్థతకు గురయ్యారు. మొత్తానికి నవీన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పడంతో పలువురు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు ఊపిరి తీసుకుంటున్నారు.
ప్రస్తుతం Mythri Movie Makers బ్యానర్ పై భారీ బడ్జెట్ లో చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఏడాది ఒకే నెలలో సీనియర్ హీరోలు చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. అంతకంటే ముందే ‘పుష్ప : ది రైజ్’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం Pushpa2 The Rule చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు టాక్.
ఇదే సమయంలో ఆర్తికలావాదేవీలకు సంబంధించిన అనుమాలతో ఐటీ అధికారులు రైడ్ నిర్వహించారు. ఏకంగా మూడు రోజులుగా నిర్విరామంగా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కాస్తా ఆందోళనకు గురైన నవీన్ యెర్నేని అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం డిశ్చార్జి చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ‘ఖుషి’,‘పుష్ప 2 : ది రూల్’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఎన్టీఆర్31’, ‘ఆర్సీ16’ రూపుదిద్దుకుంటున్నాయి.