ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజేష్ మాస్టర్ హఠాన్మరణం, ప్రముఖుల సంతాపం

Published : Apr 21, 2023, 03:22 PM IST
ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజేష్ మాస్టర్ హఠాన్మరణం, ప్రముఖుల సంతాపం

సారాంశం

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ స్టార్ కొరియోగ్రఫర్ రాజేష్ మాస్టర్ కన్ను మూశారు. ఆయన మరణం ప్రస్తుతం మిస్టరీగా మారింది. 


సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ స్టార్ కొరియోగ్రఫర్ రాజేష్ మాస్టర్ కన్ను మూశారు. ఆయన మరణం ప్రస్తుతం మిస్టరీగా మారింది. 

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది.  మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్, డ్యాన్స్ మాస్టర్ రాజేష్ గురువారం హఠాన్మరణం చెందారు. ఆయన మరమరణానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. అయితే ఆయన  ఆత్మహత్య చేసుకున్నట్టుగా. అనుమానాలు వెల్లడవుతున్నాయి. ఈ విషయంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. 

 డ్యాన్స్ మాస్టర్ రాజేష్ మరణం పట్ల ప్రముఖ మలయాళ నటీనటులు దిగ్బ్రాంతి వ్యాక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపుతున్నారు.  ప్రముఖ డ్యాన్స్ గ్రూప్ ఎలక్ట్రో బ్యాటిల్స్ ను  స్థాపించారు రాజేష్. మలయాళ పరిశ్రమకు చెందిన ఫెఫ్కా డ్యాన్స్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గానూ ఆయన ఉన్నారు. ఇక రాజేష్ మరణం పట్ట.. మలయాళ ప్రముఖ  నటి బీనా ఆంటోనీ సంతాపం ప్రకటించారు. రాజేష్ మాస్టర్ ఫొటోని తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఆమె.. బాధపడ్డారు.  అతడు తీసుకున్న రెండో నిర్ణయం ఎంతో నష్టానికి దారితీసిందంటూ.. తన  పోస్ట్ లో రాసుకొచ్చారు. 

ఇక అయితేనటి బీనా పోస్ట్ కు రకరకాల కామెంట్లు పెడుతుననారునెటిజన్లు. రాజేష్ మరణంపై ఆమెను ప్రశ్నిస్తున్నారు. రాజేష్ మరణానికి కారణం ఏంటీ అని  అభిమానులు ఆమెను ఇన్ స్టా గ్రామ్ లో ప్రశ్నిస్తున్నారు. ఇక ఆమె కూడా  అతను  ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిందంటూ బదులిచ్చారు. రాజేష్ మరణ వార్త తనను షాక్ కు గురి చేసినట్టు మరో  ప్రముఖ  మలయాళ నటి దేవి చందనా సంతాపం వ్యక్తం చేశారు.  అంతే కాదు సినిమాటిక్, బాలీవుడ్ డ్యాన్స్ ను మలయాళ ఇండస్ట్రీలోకి.. మరీ ముఖ్యంగా  తన జీవితంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అంటూ ఫేస్ బుక్ లో  పోస్ట్ పెట్టారు నటి చందన. 

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు
Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్