
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, దివంగత యష్ చోప్రా సతీమణి పమేలా చోప్రా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ ముందురోజు టాలీవుడ్ కమెడియన్ అల్లు రమేశ్ తుదిశ్వాస విడిచారు. ఇలా ఏదో చోట ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఇండ్లలో విసాదాలు జరుగుతుండటం బాధాకరంగా మారింది.
తాజాగా మలయాళ స్టార్ మమ్ముట్టి (Mammootty) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి ఫతిమా ఇస్మాయిల్ (Fatima Ismail) ఈరోజు ఉదయం కన్నుమూశారు. 93 ఏండ్లలో వయయస్సులో శరీరం సహకరించక తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను కొచ్చిలోని ఓ ప్రైయివేట్ ఆస్ప్రతిలో చికిత్స అందిస్తున్నారు. ఈరోజు ఉదయం పరిస్థితి విషమించి మరణించినట్టు తెలుస్తోంది.
మమ్ముట్టి తల్లి గారి మరణవార్తను తెలుసుకున్న మలయాళ నటీనటులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికను ఆమెకు నివాళి అర్పిస్తున్నారు. మమ్ముట్టికి, కుటుంబ సభ్యులను తమ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు కబ్రిస్తాన్ లోని చెంపు జుమా మజీద్ లో ఆమె అంత్యక్రియలు జరగున్నాయి.
ఫతిమా ఇస్మాయిల్ కు ఇబ్రహీం కుట్టి, జకారియా, అమీనా, సౌదా మరియు షఫీనాకు ఉన్నారు. మలయాళ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఆమె మనవడు. మమ్ముట్టి ఇంట విషాదం జరగడంతో సినీ ప్రముఖులతో పాటు పొలిటికల్ లీడర్లు కూడా తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్స్ రాస్తున్నారు.
ఇక మమ్ముట్టీ కీలక పాత్రలో నటించిన ‘ఏజెంట్’ Agent చిత్రం మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. అక్కిల్ అక్కినేనికి సపోర్ట్ గా స్పై థ్రిల్లర్ మూవీతో అలరించబోతున్నారు. ఇప్పటికే మమ్ముట్టీ సౌత్ లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. గతంలో ‘యాత్ర’సినిమాతో ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఏప్రిల్ 28న అఖిల్ ‘ఏజెంట్’తో వస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మించారు.