నాకు మా నాన్నే దేవుడు... మరోసారి అల్లు అర్జున్ కీలక కామెంట్స్

By Sambi ReddyFirst Published May 30, 2023, 6:48 PM IST
Highlights

హీరో అల్లు అర్జున్ మెగా హీరో ట్యాగ్ వదిలించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడనే వాదన ఉంది. దానికి ఆయన లేటెస్ట్ కామెంట్స్ బలం చేకూర్చాయి. 
 


ఆ మధ్య మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆత్మీయ సమ్మేళనంలో అల్లు అర్జున్ మీద కీలక ఆరోపణలు చేశాడు. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ వలన ఎదిగి ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అల్లు అర్జున్ కి ఇకపై మనం మద్దతు ఇవ్వకూడదని అన్నారు. అప్పుడది వివాదాస్పదమైంది. తర్వాత సదరు వ్యక్తి క్షమాపణలు చెప్పారు. కొన్నాళ్లుగా మెగా ఫ్యాన్స్ అందరూ ఒక్కటి కాదు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కలిసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియా వార్ కి దిగుతున్నారు. 

ఈ క్రమంలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కి గెస్ట్ గా విచ్చేసిన అల్లు అర్జున్.. మా నాన్న నాకు దైవంతో సమానం. నేను చూసిన దేవుడు ఆయనే. నాకు అన్నీ ఇచ్చిన నాన్నే నాకు దేవుడు అన్నారు. తన ఫేమ్ నేమ్ కి కారణం నాన్న మాత్రమే అన్నట్లు అల్లు అర్జున్ వ్యాఖ్యలు ఉన్నాయని కొందరు భావిస్తున్నారు. 

అనంతరం బన్నీ నటించిన 'పిలగా నువు ఇరగ ఇరగ' సాంగ్ ని శృతి అనే సింగర్ గొప్పగా పాడింది. అల్లు అర్జున్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఆమెకు తన సంతకంతో కూడా బ్యాడ్ ఇచ్చాడు.  ఈ శృతి పేరు అన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్ లవర్ పేరు శృతినే, అని గట్టిగా నవ్వారు. అంటే స్నేహారెడ్డి కంటే ముందే అల్లు అర్జున్ శృతి అనే అమ్మాయిని ప్రేమించాడన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో స్నేహారెడ్డి ఫీలింగ్ ఏంటని కొందరు అంచనా వేస్తున్నారు. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూట్లో పాల్గొంటున్నారు. చాలా వరకు చిత్రీకరణ ముగిసిందని సమాచారం. డిసెంబర్ లోనే పుష్ప 2 రావచ్చని తెలుస్తుంది. పుష్ప 1 క్రిస్మస్ కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది. 
 

click me!