స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తాజాగా ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది. ఈ సందర్బంగా సమంత ధరించిన షూస్ ధర నెట్టింట వైరల్ గా మారింది. వాటి ఖరీదు ఎంతో తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.
స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా ‘శాకుంతలం’ చిత్రంతో అలరించింది. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఈ సందర్భంగా తరుచుగా ప్రయాణాలు చేస్తోంది. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించింది. సామ్ విమానాశ్రయంలో దర్శనమివ్వడంతో ఫొటోలు, వీడియోలు తీశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సామ్ కు సంబంధించిన మరో న్యూస్ కూడా వైరల్ గా మారింది.
సమంత డిఫరెంట్ లుక్ లో మెరిసింది. స్టైలిష్ దుస్తుల్లో అదరగొట్టింది. ఇదే క్రమంలో సమంత ధరించిన చప్పల్ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. దీంతో అదే మోడల్, అదే బ్రాండ్ కాస్ట్ ను నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. దీంతో ఆ చప్పల్ ప్రైజ్ రూ.2,58,097గా ఉందని తెలుస్తోంది. అందరూ షాక్ అవుతున్నారు. ఇక సెలబ్రెటీలు వాడే వస్తువులు, ధరించే దుస్తులు ఖరీదైనవిగా ఉంటాయన్న విషయం తెలిసిందే. కానీ మరీ రెండు లక్షలకు పైగా చెప్పులకు ఖర్చు చేయడం ఆసక్తికరంగా మారింది.
రీసెంట్ గా పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’ చిత్రం నుంచి ద్వయం పోస్టర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ధరించిన షూస్ కూడా నెటిజన్ల కంట పడింది. వాటి ధరనూ ఆరతీయగా.. రూ. లక్షా ఆరువేలుగా తెలిసింది. ఇలా స్టార్ సెలబ్రెటీలు తమ ప్రయాణాల కోసం బయటికి వస్తున్నప్పుడల్లా వారు వాడుతున్న వస్తువుల ధర ఎంతనేది తెలుసుకుంటున్నారు.
ఇక సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’లో నటిస్తున్న విషయం తెలిసిందే. బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ‘ఫ్యామిలీ మెన్’ సిరీస్ ద్వయం దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘సిటాడెల్’ సిరీస్ లోనూ సమంత నటిస్తోంది. ఆ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకొనే తాజాగా సామ్ హైదరాబాద్ కు చేరుకుంది.
🖤🤍
Gorgeous seen slaying the airport look like a pro as she departs from Hyderabad!! 😎✈️ pic.twitter.com/XLFngBjo5j