‘కడుపు మంట’ అంటూ థమన్ ట్వీట్.. ‘గుంటూరు కారం’పై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టినట్టేనా?

Published : Jun 20, 2023, 02:49 PM ISTUpdated : Jun 20, 2023, 02:57 PM IST
‘కడుపు మంట’ అంటూ థమన్ ట్వీట్.. ‘గుంటూరు కారం’పై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టినట్టేనా?

సారాంశం

మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman)  అందిస్తున్నారు. అయితే తాజాగా ఆయనను తప్పించినట్టు వార్తలు వస్తున్నాయి. రూమర్లపై ఇలా స్పందించారు.  

టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ తనదైన ముద్ర వేసుకున్నారు. భారీ ప్రాజెక్టుల్లో పనిచేస్తూ తన సంగీతం ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతమూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం తెలుగులో భారీ చిత్రం వస్తుందంటే మొదట థమన్ పేరే వినిపిస్తోంది. అలాగే దేవీ కూడా. దాటితే తమిళ మ్యూజిక్ డైరెక్టర్లు అవకాశం దక్కించుకుంటున్నారు. 

కాగా, థమన్ సంగీత దర్శకుడిగా ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్స్  రూపుదిద్దుకుంటున్నాయి. అందులో ఒకటి Guntur Kaaram. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ అదిరిపోయే బీజీఎం, మ్యూజిక్ కంపోజ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక థమన్ మిగతా వర్క్ పై ఫోకస్ పెట్టారు. 

ఇంతలో ఏమైదో గానీ.. థమన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. మహేశ్ బాబు - థమన్ మధ్య విబేధాలు వచ్చాయని, అందుకే సైడ్ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇది సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గ్గా మారింది. దీనిపై ఇక థమన్ కూడా తనదైన శైలిలో స్పందించారు. గతంలో ఇలాంటి రూమర్లను థమన్ చూశాడు. ఎప్పటికప్పుడు బదులిస్తూనే వచ్చాడు. తాజాగా కూడా ట్వీట్ తో ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

నిన్న రాత్రి ట్వీట్ చేస్తూ.. ‘రేపటి నుంచి మా స్టూడియోలో బట్టర్ మిల్క్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నాను. ఉచితంగా పంపిణీ చేస్తాం. ఎవరికైనా కడుపు మంట ఉంటే దయచేసి ఇక్కడి రండి. మజ్జిగ తాగండి. చాలా పని మిగిలి ఉంది. నా సమయం వృథా చేయాలనుకోవడం లేదు. మీరు కూడా టైమ్ వెస్ట్ చేసుకోకండి.‘ అని పేర్కొన్నారు. అయితే థమన్ ఏ ఉద్దేశంతో ఇలా ట్వీట్ చేశాడో గానీ కౌంటర్ మాత్రం ఆ రూమర్లపైనే అని అర్థం అవుతోంది. దీంతో థమన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోలేదని స్పష్టం అయినట్టే. 

PREV
click me!

Recommended Stories

Sreenivasan: నటుడు శ్రీనివాసన్ ని ఆరాధించిన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఏకంగా తన పాత్రకి డబ్బింగ్‌
కృష్ణ ను భయపెట్టిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కు చెక్ పెట్టడానికి సూపర్ స్టార్ మాస్టర్ ప్లాన్