మరో సినిమా స్టార్ట్ చేసిన బలగం వేణు, ఈసారి ఏం తీయబోతున్నాడంటే..?

Published : Jun 20, 2023, 02:46 PM IST
మరో సినిమా స్టార్ట్ చేసిన బలగం వేణు, ఈసారి ఏం తీయబోతున్నాడంటే..?

సారాంశం

బలగం సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన  దర్శకుడు, నటుడు వేణు.. తనకెరీర్ లో మరో అడుగు వేశాడు. బలగం తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన మరో సినిమాను అఫీషియల్ గా స్టార్ట్  చేశారు.   

మొన్నటి వరకూ ఒక సాధారణ జబర్థస్త్ కమెడియన్.. వేణు యెల్దండి.. ఇప్పుడు టాలీవుడ్ లో తనను తాను నిరూపించుకున్న దర్శకుడు.  నాలుగు నెలల ముందు వరకు వేణు అంటే ఎవరికీ తెలియదు. జబర్దస్త్ వేణు అనగానే అందరు గుర్తు పడగారు. కాని ఇప్పుడు మాత్రం బలగం వేణు అంటేనే అందరికి అర్ధం అవుతుంది. అంతలా తన సినిమాతో ప్రభావితం చేశాడు వేణు. కమెడియన్ గానే ప్రేక్షకులను నవ్వించడమే కాదు.. తెర వెనుక డైరెక్టర్ గా భావోద్వేగాలతో కన్నీళ్లు పెట్టించడమూ తెలుసని  బలగం సినిమాతో నిరూపించుకున్నాడు వేణు. 

మొదటి సినిమాతోనే డైరెక్టర్‌ గా  బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన వేణు.. ప్రస్తుతం సెంకండ్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. బలగం తరువాత వేణు తరువాత మూవ ఎప్పుడు చేస్తాడా అని అంతా  ఎదురుచూశారు.ఇప్పటికీ  రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే  తన నెక్ట్స్ సినిమాపై డైరెక్టర్ వేణు అప్‌డేట్ ఇచ్చారు. తను తీయబోతున్న రెండో సినిమా స్క్రిప్టు పనుల్ని ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించారు. 

 

 

ఇక ఇందుకు సంబంధించి పెన్ను, పేపర్ ఫోటోని షేర్ చేశారు. తన రెండో సినిమాలో కూడా ఎమోషనల్ సీన్స్ ఉండేలా వేణు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు దిల్ కుష్ అవుతున్నారు. రకరకాల కామెంట్లతో అతనికి  ఆల్ ది బెస్ట్ చెపుతున్నారు. అంతే కాదు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బలగం మాదిరిగానే ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక వేణు ఎలాంటి సినిమా తీయనున్నారు? హీరో హీరోయిన్లు ఎవరు? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Sreenivasan: నటుడు శ్రీనివాసన్ ని ఆరాధించిన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఏకంగా తన పాత్రకి డబ్బింగ్‌
కృష్ణ ను భయపెట్టిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కు చెక్ పెట్టడానికి సూపర్ స్టార్ మాస్టర్ ప్లాన్