చెలరేగిపోయిన కాజల్ - శ్రీలీల. బాలయ్య మాస్ పాటకు ఊరమాస్ స్టెప్పులేసిన తారలు

Published : Jun 20, 2023, 01:49 PM ISTUpdated : Jun 20, 2023, 02:40 PM IST
చెలరేగిపోయిన కాజల్ - శ్రీలీల. బాలయ్య మాస్ పాటకు ఊరమాస్ స్టెప్పులేసిన తారలు

సారాంశం

కాజల్, శ్రీలీల అదరిపోయేలా డాన్సులేశారు. అద్భుతమైన స్టెప్స్ తో అదరగొట్టారు. అది కూడా ఊరమాస్ సాంగ్ కు పూనకాలు వచ్చినట్ట ఊగిపోయారు. ఇంతకీ ఇద్దరు డాన్స్ వేయడానికి కారణం ఏంటీ..? 

వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడిన నందమూరి బాలకృష్ణ... అఖండ సినిమాతో  తిరుగులేని కంబ్యాక్ ఇచ్చారు. ఇక అదే ఊపులో వరుస సినిమాలు తెరకెక్కిస్తున్నాడు బాలయ్య బాబు. అదే ఊపులో ఈ ఏడాది వీరసింహా రెడ్డితో అబ్బుతమైన సక్సెస్ ను సాధించాడు. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ఒకదాని వెంట మరొక సినిమా తెరకెక్కిస్తూనే ఉన్నాడు బాలయ్య. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్ పై కన్నేసిన నందమూరి హీరో.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. దసరాకి ఈసినిమా ఎలాగైనా రిలీజ్ చేయాలని కష్టపడుతున్నారు టీమ్. ఇక ఈసినిమా షూటింగ్ లో ఉండగానే..మెగా డైరెక్టర్ బాబీతో సినిమా ఓపెనింగ్ కూడా చేసేశాడు బాలయ్య. 

ఇక భగవంత్ కేసరి షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు అనిల్ టీమ్. ఈక్రమంలోనే  గతంలో  ఈ సినిమా సెట్‌లో అనీల్ రావిపూడి ఫైట్‌ మాస్టర్‌లతో కలిసి బాలయ్య సాంగ్‌కు స్టెప్పులేశాడు. అప్పుడు అది తెగ వైరల్‌ అవ్వగా... ఇప్పుడు మరోసారి ఈ సెట్ లో డాన్స్ పార్ఫామెన్స్ లతో దడదడలాడింది. ఈసినిమాలో నటిస్తున్న తారలు.. కాజల్‌ అగర్వాల్, శ్రీలీల నరసింహ నాయుడు సినిమాలోని చిలకపచ్చ కోక పాటకు ఊరమాస్  స్టెప్పులేసి అందరిని ఆశ్చర్యపరిచారు..

 

ఇక ఈ వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్‌ చేస్తుంది.అంతే కాదు రకరకాల కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో కాజల్‌, బాలయ్యకు జోడీగా నటించగా.. శ్రీలీల కీలకపాత్ర పోషిస్తుంది. ఇక బాలయ్య బర్త్‌డే సందర్భంగా పది రోజుల కిందట విడుదలైన టీజర్‌కు వీర లెవల్లో రెస్పాన్స్‌ వచ్చింది. బాలయ్య సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ఈ మధ్య కాలంలో ఒక టీజర్‌తో సినిమాపై ఎక్కడలేని హైప్‌ రావడం బహుశా ఈ సినిమాకే దక్కింది .. షైన్‌ స్క్రీన్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

అఖండ, వీరిసింహారెడ్డి తరువాత ఈసినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు బలయ్య బాబు. అందుకే ఈసినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఈసినిమా హిట్ అయితే.. ఇక నందమూరి అభిమానులకు పండగనే చెప్పాలి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే, అభిమానులకు పోలీసుల వార్నింగ్..? అన్నపూర్ణ స్టూడియో ముందు ప్రత్యేకంగా నిఘ