Sound Of Salaar : రవి బస్రూర్ కంపోజింగ్ ఎప్పుడైనా చూశారా? ‘సలార్’కు ఎలా దుమ్మురేపారో చూడండి!

Published : Dec 23, 2023, 10:52 AM ISTUpdated : Dec 23, 2023, 10:57 AM IST
Sound Of Salaar : రవి బస్రూర్ కంపోజింగ్ ఎప్పుడైనా చూశారా? ‘సలార్’కు ఎలా దుమ్మురేపారో చూడండి!

సారాంశం

‘కేజీఎఫ్’తో ఇండియా మొత్తం తన సంగీతంతో సెన్సేషన్ క్రియేట్ చేశారు రవి బస్రూర్ (Ravi Basrur). ఇక ప్రస్తుతం Salaarతో మళ్లీ వచ్చారు. యాక్షన్ ఫిల్మ్ లో Sound of Salaar ట్యూన్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.   

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా రవి బస్రూర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతి సినిమాకు తనదైన శైలిలో సంగీతం అందిస్తూ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన అందించే బీజీఎం, సాంగ్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటున్నాయి. ఇదే విషయాన్ని కన్నడ సూపర్ స్టార్ యష్ (Yash)  - ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’తో ప్రూవ్ చేశారు. కేజీఎఫ్ కు రవి బస్రూర్ అందించిన మ్యూజిక్ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంది. 

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - Prashanth Neel   కాంబోలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సలార్’ (Salaar) తో మళ్లీ తనదైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఎలివేషన్లకు రవి బస్రూర్ ఇచ్చిన ట్యూన్ నెక్ట్స్ లెవల్లో ఉంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ఫ్రెండ్షిప్, కొన్ని ఎమోషనల్ సీన్లకు ఆయన కంపోజ్ చేసిన ట్యూన్ అందరినీ ఆకట్టుకుంటోంది. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది. 

ఈ క్రమంలో తాజాగా Salaar Cease Fire  మేకర్స్ సౌండ్ ఆఫ్ సలార్ (Sound of Salaar) పేరిట ఓ వీడియోను విడుదల చేశారు. పదుల సంఖ్యలో డ్రమ్స్ వాయిస్తుండటం... రవిబస్రూర్ వారిని గైడ్ చేస్తుండటం చాలా ఆసక్తికరంగా మారింది. ఓ పెద్ద హాల్ లో ‘సలార్’ కోసం ప్రత్యేకమైన టీమ్ తో హృదయాన్ని కదిలించే ట్యూన్ ను ప్లే చేయించారు. హోంబలే ఫిల్మ్స్ వారు అధికారికంగా ఈ వీడియోను విడుదల చేశారు. అయితే రవి బస్రూర్ ఎలా డ్రమ్స్ వాయిస్తారో ఆడియెన్స్ కు కూడా చూపించారు. 

రవి బర్సూర్ గతంలో తెలుగు సినిమా ‘మార్షల్’కు బీజీఎం అందించారు. ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. జీబ్రా, సీతా మనోహర శ్రీ రాఘవ వంటి చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. కన్నడతో మరోవైపు హిందీ నుంచి కూడా అవకాశాలు అందుకున్నారు. బాలీవుడ్ ఫిల్మ్ ‘సర్జామీన్’కు వర్క్ చేస్తున్నారు. ఇక ‘సలార్’ థియేటర్లలో దుమ్ములేపుతోంది. పాజిటివ్ టాక్ రావడంతో... ఆడియెన్స్ థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. ఆదివారం వరకైతే హౌజ్ ఫుల్ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ Shruti Haasan  కథనాయిక. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరీ రావు, టిన్ను ఆనంద్, సప్తగిరి, యాంకర్ ఝాన్సీ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 22న విడుదలైంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యో అరెస్ట్- ఉలుకుపలుకు లేకుండా పడిపోయిన సుమిత్ర-నోరు జారిన పారు
Mowgli Movie Review: మోగ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమ కనకాల కొడుక్కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?