
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ దేశవ్యాప్తంగా సినిమా అభిమానుల్లో ఫీవర్ లా మారిపోయింది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ఫ్యాన్స్ సలార్ జపం చేస్తున్నారు. తొలిరోజే ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు.
ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని ఎలివేట్ చేస్తూ బ్లడ్ బాత్ చేయిస్తూ డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా ఉన్నాయి. సెలెబ్రిటీలు సైతం ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ కి ఫిదా అవుతున్నారు.
ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సలార్ చిత్రానికి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. బాక్సాఫీస్ ని తగలబెట్టేస్తున్నందుకు మై డియర్ దేవా రెబల్ స్టార్ ప్రభాస్ కి కంగ్రాట్స్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి నా అభినందనలు. సరికొత్త ప్రపంచాన్ని సృష్టించడం లో మీకు మీరే సాటి. వరదరాజ మన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఆద్యగా శృతి హాసన్, కార్త పాత్రలో జగపతి బాబు అద్భుతంగా నటించారు.
అలాగే హోంబాలే సంస్థకు, చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. దీనితో ప్రభాస్ అభిమానులు థాంక్యూ బాస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సలార్ లో మొదటి భాగాన్ని ;'సలార్ సీజ్ ఫైర్' అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. రెండవ భాగానికి సలార్ శౌర్యాంగ పర్వం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బాహుబలి తర్వాత ప్రభాస్ అభిమానులకు అత్యంత సంతృప్తి నిచ్చిన చిత్రం ఇదే. ప్రభాస్ కటౌట్ ని కరెక్ట్ గా వాడుకుంటూ ప్రశాంత్ నీల్ మాస్ చిత్రాన్ని అందించారు.