
రాజ్-కోటి మ్యూజిక్ ద్వయంలో ఒకరైన రాజ్ మే 21న హఠాన్మరణం పొందారు. తన నివాసంలో రాజ్ గుండెపోటుకు గురయ్యారు. రాజ్ కి భార్య, ముగ్గురు కుమార్తెలు. రాజ్ మరణవార్త చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు ప్రఘాడ సానుభూతి తెలియజేశారు. రాజ్-కోటి ద్వయం టాప్ స్టార్స్ చిత్రాలకు పని చేశారు. అద్భుతమైన పాటలు ఇచ్చారు.
నేడు రాజ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నేడు ఉదయం 9:30-10 గంటల ప్రాంతంలో ఫిల్మ్ నగర్ లో గల వైకుంఠ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు కుటుంబ సభ్యులు తెలియజేశారు. చిత్ర ప్రముఖులు, అభిమానులు రాజ్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారని సమాచారం.
90లలో రాజ్-కోటి టాలీవుడ్ ని ఏలారు. స్టార్ హీరోలకు పక్కా కమర్షియల్ హిట్స్ రాజ్-కోటి ఇచ్చారు. ఇళయరాజా ప్రభంజనాన్ని తట్టుకొని నిలిచిన సంగీత ద్వయం రాజ్-కోటి. మెగాస్టార్ చిరంజీవికి అయితే లైఫ్ టైమ్ గుర్తుండే పాటలు ఇచ్చారు. ఇద్దరూ మ్యూజిక్ డైరెక్టర్స్ వారసులే. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయన తండ్రి టీవీ రాజు మ్యూజిక్ డైరెక్టర్. ఇక కోటి పూర్తి పేరు సాలూరి కోటేశ్వరరావు. మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి రాజేశ్వరరావు కుమారుడు. వీరిద్దరూ కలిసి తమ సంగీత ప్రయాణం సాగించారు.
1982లో మొదలైన వీరి జర్నీ సక్సెస్ఫుల్ గా సాగింది. రాజ్-కోటి మ్యూజిక్ అంటే సూపర్ హిట్ అనే ఒక బ్రాండ్ నేమ్ ఏర్పడింది. ఒక దశాబ్దం పాటు వీరు చిత్ర పరిశ్రమను ఏలారు. సక్సెస్ ఫుల్ గా సాగుతున్న వీరి జర్నీ సడన్ రెండు దారులు తీసుకుంది. 1995 తర్వాత రాజ్-కోటి విడిపోయారు. అప్పట్లో ఇది సంచలన పరిణామం.