
పరిశ్రమలో తేజాకు ముక్కుసూటి మనిషిగా పేరుంది. కెరీర్ బిగినింగ్ లో తేజా అద్భుతాలు చేశారు. ఆయన మ్యాజిక్ చేసి చాలా కాలం అవుతుంది. అహింస మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కుతారని ఆడియన్స్ భావిస్తున్నారు. కాగా కెరీర్లో అనేక ఎత్తుపల్లాలు చూసిన తేజా వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
జీవితంలో నాకు జరిగిన అవమానాలు, చేసిన తప్పులను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. మళ్లీ వాటిని చేయకూడదని గట్టిగా భావిస్తున్నాను. ఒకసారి ఇంటిపై లోన్ తీసుకున్నాను.ఓ నాలుగు సంవత్సరాలు సినిమాలు చేయలేదు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో బ్యాంక్ వాళ్లు ఇంటిని జప్తు చేస్తున్నట్లు గోడకు నోటీసు రాసిపెట్టారు.
కొద్ది రోజులకు డబ్బులు బ్యాంక్‌కు మొత్తం చెల్లించాను. ఇక లైఫ్ లో ఎప్పుడు లోన్ తీసుకోకూడదని గుర్తు పెట్టుకోవడం కోసం వాళ్లు రాసిన నోటీసు తొలగించకుండా అలాగే ఉంచాను. ఇక, నేను చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్‌లు అయ్యాయి. సినిమా చేస్తున్నప్పుడే హిట్ లేదా ఫ్లాప్ అనేది తెలుస్తుంది. అందుకే ఏ సినిమాపైనా నేను ఆశలు పెట్టుకోను'' అని తేజ వివరించారు. అలాగే తన కుమారుడిని హీరోగా లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.