
సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు టీడీపీ శ్రేణులు అట్టహాసంగా నిర్వహించాయి. మే 20న దీనిలో భాగంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. టీడీపీ నేత టీడీ జనార్దన్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సభకు ప్రత్యేకంగా ఆహ్వానించారు.అయితే ఈ వేడుకకు ఎన్టీఆర్ రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అదే రోజు కావడంతో... ముందుగా నిర్ణయించుకున్న ఫ్యామిలీ కమిట్మెంట్స్ నేపథ్యంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకకు రావడం లేదని ప్రెస్ నోట్ విడుదల చేశారు. కారణం ఏదైనా జూనియర్ ఎన్టీఆర్ తాతయ్య శతజయంతి ఉత్సవాలకు దూరంగా ఉన్నారు.
బాలకృష్ణ-చంద్రబాబు ఆద్వర్యం లో జరిగిన ఈ సభకు టాలీవుడ్ స్టార్స్ అందరినీ పిలిచారు. పవన్, ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సైతం వస్తున్నారని ప్రకటనలు విడుదల చేశారు. అయితే వారెవరూ రాలేదు. రామ్ చరణ్ మాత్రం హాజరయ్యారు. ఇంకొందరు హీరోలు ఈ వేడుకలో భాగమయ్యారు. రామ్ చరణ్ తన స్పీచ్ లో మా బాలయ్య, మా చంద్రబాబు అని సంబోధించడం టీడీపీ శ్రేణులకు ఎక్కడలేని సంతోషం కలిగించింది. త్వరలో ఎన్నికలు కాగా రాజకీయంగా ఈ పరిణామాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్ ని సైతం చరణ్ ఆకాశానికి ఎత్తారు.
మెగా హీరో రామ్ చరణ్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరై జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాత పేరు వాడుకొని ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ ఉత్సవాల కోసం సమయం కేటాయించలేకపోయాడు. రామ్ చరణ్ వీలు చేసుకొని వచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ స్వార్థ పరుడు, అవసరం తీరాక తాతను మర్చిపోయాడని అసహనం ప్రదర్శిస్తున్నారు.
బాలయ్య ఫ్యాన్స్ తో పాటు టీడీపీలోని ఒక వర్గం పార్టీ మార్చేశారు. మొన్నటి వరకు చరణ్ తిట్టినవాళ్లు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని తిడుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఎన్టీఆర్ గొప్ప అన్నోళ్లు ఇప్పుడు చరణ్ గొప్పంటున్నారు. ఇకపై మా సప్పోర్ట్ చరణ్ కే... ఎన్టీఆర్ కి కాదు అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతున్నారు బాలయ్య ఫ్యాన్స్ లో ఈ మార్పు చూసిన జూనియర్ డై హార్డ్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకున్నారు.