Imman Divorce: షాకింగ్.. విడాకులు ప్రకటించిన 'అన్నాత్తే' మ్యూజిక్ డైరెక్టర్ !

Published : Dec 29, 2021, 03:06 PM IST
Imman Divorce:  షాకింగ్.. విడాకులు ప్రకటించిన 'అన్నాత్తే' మ్యూజిక్ డైరెక్టర్ !

సారాంశం

చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీ జంటల గురించి ఊహించని వార్తలు వస్తున్నాయి. వరుసగా బ్రేకప్ లు చోటు చేసుకుంటున్నాయి. నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుని అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. తాజాగా మరో జంట విడాకుల బాట పట్టారు.

చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీ జంటల గురించి ఊహించని వార్తలు వస్తున్నాయి. వరుసగా బ్రేకప్ లు చోటు చేసుకుంటున్నాయి. నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుని అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. తాజాగా మరో జంట విడాకుల బాట పట్టారు. సౌత్ లో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న D Imman తన భార్యతో విడాకులు ప్రకటించారు. 

తన భార్య మోనికా రిచర్డ్ నుంచి విడిపోతున్నట్లు ఇమాన్ సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు. దీనితో ఇమాన్, మోనికా 13 ఏళ్ల వివాహ బంధానికి తెరపడినట్లు అయింది. వాస్తవానికి ఇమాన్, మోనికా 2020లోనే చట్టబద్ధంగా విడాకులు పొందారు. కానీ ఇమాన్ ఆ విషయాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. 

దీనితో ఇమాన్ అభిమానులను, సన్నిహితులని ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 'నా శ్రేయోభిలాషులకు, సంగీతాభిమానులకు కృతజ్ఞతలు. మీరు నాకు ఎంతో మద్దతు ఇస్తూ వచ్చారు. నేను, మోనికా 2020 నవంబర్ లో చట్టబద్ధంగా విడాకులతో విడిపోయాం. జీవితంలో విభిన్న మార్గాలు ఎంచుకున్నాం. ఇకపై మేము భార్య భర్తలం కాదు. మా ప్రైవసీకి భంగం కలిగించకుండా సహకరిస్తారని ఆశిస్తున్నాం అని పోస్ట్ పెట్టారు. 

Also Read: గాగ్రాకు చోళీకి చిన్న గ్యాప్ ఇచ్చి నడుము అందాలు చూపిస్తూ గుండెల్లో చూపుల బాణం గుచ్చిన బోల్డ్ బ్యూటీ ప్రియమణి

ఇమాన్ 2002లో ఇళయదళపతి విజయ్ నటించిన 'తమిళన్' చిత్రంతో సంగీత దర్శకుడిగా మారారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించారు. ఇటీవల ఇమాన్.. అజిత్ 'విశ్వాసం'.. రజనీకాంత్ 'అన్నాత్తే' చిత్రాలకు మ్యూజిక్ అందించారు. 

ఇమాన్, మోనికా ఇద్దరూ 2008లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. మోనికా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. మనస్పర్థల కారణంగా ఇమాన్, మోనికా విడిపోయినట్లు తెలుస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: మీకు నాకంటే దీపే ఎక్కువన్న జ్యో-పారు మాటలను తండ్రితో చెప్పిన శౌర్య
Akhanda 2 Release పై మరో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన నిర్మాతలు.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?