స్టార్ సింగర్ తో.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లవ్ ఎఫైర్...? వైరల్ అవుతున్న న్యూస్..

By Mahesh Jujjuri  |  First Published Jul 10, 2023, 9:12 AM IST

యువ సంగీత కెరటం అనిరుధ్ పై ఇండస్ట్రీలో ఇప్పటికే రకరకాల రూమర్స్ ఉన్నాయి.. కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి.తాజాగా ఈ స్టార్ మ్యుజీషియన్ పై మరోసారి.. వార్తలు హైలెట్ అవుతున్నాయి.. వివరాల్లోకి వెళ్తే..


తమిళ సంగీత యువ కెరటం అనిరుధ్. చాలా చిన్న వయస్సులోనే కెరీర్ ను స్టార్ట్ చేసి.. సంచలనంగా మారాడు అనిరుధ్. కొలవరీ సాంగ్ లో ఒక్కసారిగా కోలీవుడ్ పై పట్టుసాధించాడు యంగ్ స్టార్. వరుసగా ఆఫర్లు కొట్టేసి.. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్లకే గట్టి పోటీ ఇచ్చాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు కూడా మ్యూజిక్ చేస్తూ.. చాలా చిన్న వయస్సులోనే పెద్ద పేరు సంపాదించాడు. తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నా కూడా.. టాలీవుడ్ లోకి కూడా చాలా సునాయాసంగా ఎంట్రీ ఇచ్చి.. ఇక్కడ కూడా తన మార్క్ చూపించాడు అనిరుధ్. అజ్ఞాతవాసి సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టి..వరుసగా  సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవరకు మ్యూజిక్ చేస్తున్నాడు అనిరుధ్. 

ఇక 20 ఏళ్ల వయస్సులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనిరుధ్.. పదేళ్ల కెరీర్ లో.. ఎన్నో సాధించాడు.. వాటితో పాటు వివాదాలు కూడా మూటగట్టుకున్నాడు. ముఖ్యంగా అనిరుధ్ రవిచంద్రన్ తో లవ్ ఎఫైర్స్ అంటూ చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా ప్రముఖ సింగర్ జోనితా గాంధీతో అనిరుధ్ లవ్ ఏఫైర్ నడిపిస్తున్నట్టు కోలీవుడ్ అంతా కోడై కూస్తోంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ జోరుగా చక్కర్లు కొడుతోంది. సింగర్ జోనితా.. విజయ్ బీస్ట్ సినిమాలో అరబిక్ కుత్తు సాంగ్ పాడి ఫేమస్ అయ్యింది .

Latest Videos

అయితే వీరిద్దరి మధ్య బంధం కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో స్ట్రాంగ్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. ఆసినిమా టైమ్ నుంచి కలిసి తిరగడం స్టార్ట్ చేశారట ఇద్దరు. ఇక  అప్పటి నుంచి ఎక్కడ చూసినా..వీరే కనిపిస్తున్నారంటూ.. కోలీవుడ్ మీడియాలో న్యూస్ కాకరేపుతోంది.  అనిరుధ్ ఎక్కడ ఉంటే జోనితా అక్కడికి వెళ్లిపోతుందట. పబ్లిక్ గానే వీరు కలిసి తిరుగుతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతే కాదు వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని.. త్వరలో పెళ్ళి  కూడా చేసుకుంటారంటున్నారు. అయితే ఇంత ప్రచారం జరుగుతున్నా.. ఈ ఇద్దరిలో ఎవరూ.. ఈ వార్తలను ఇప్పటి వరకూ ఖండించలేదు. దాంతో అందరి అనుమానం బలపడుతోంది. 

ఇక అనిరుధ్ రవిచంద్రన్ పై ఇలాంటి వార్తలు.. వివాదాలు కామన్.. కొంత కాలంగా చాలా మందితో అనిరుధ్ ఎఫైర్ నడిపినట్టు న్యూస్ వైరల్ అయ్యాయి. కోలీవుడ్ సుచీలీక్స్ పేరిట రిలీజ్ అయి సెలబ్రిటీల జాతకాలలో.. అనిరుధ్ ప్రముఖ హీరోయిన్ ఆండ్రియాతో లిప్ లాక్ ఇస్తున్న ఫోటో.. పెద్ద దుమారమే రేపింది. మరికొంత మందితో అనిరుధ్ ప్రేమాయణం అంటూ కథనాలు కోకోల్లలుగా వచ్చాయి గతంలో. అంతే కాదు హీరోయిన్ కీర్తి సురేష్ తో కూడా అనిరుధ్ రిలేషన్ లో ఉన్నట్టు.. వారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని కూడా.. వార్తలు హైలెట్ అయ్యాయి గతంలో. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలపై వారు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. 

click me!