మీరు "గే" కదా... కరణ్ జోహార్ కు నెటిజన్ షాకింగ్ ప్రశ్న, అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్..

Published : Jul 10, 2023, 08:32 AM IST
మీరు "గే" కదా... కరణ్ జోహార్ కు నెటిజన్ షాకింగ్ ప్రశ్న,  అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్..

సారాంశం

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కు షాక్ ఇచ్చాడు ఓ నెటిజన్. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో.. ఆయన్ను అడక్కూడని ప్రశ్న అడిగేశాడు. దానికి కరణ్ జోహార్ కూడా అదిరిపోయే సమాధానం చెప్పాడు. ఇంతకీ ఆయన ఏమన్నాడు..?   

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్  డైరెక్టర్  కరణ్ జోహార్  గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. మన టాలలీవుడ్ లో దిల్ రాజు ఎంత ఫేమస్సో.. బాలీవుడ్ లో కరణ్ జోహార్ అంత ఫేమస్.. బాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలు చేయాలంటే ఆయన  తరువాతే.. కరణ్ జోహార్ అంటే దాదాపు అన్ని ఇండస్ట్రీల జనాలకు  సుప‌రిచితుడే.  కరణ్ జోహార్ కు  స్టార్ హీరోకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇండస్ట్రీలో. ఇక స్టార్లను సూపర్ స్టార్లను హోస్ట్ గా ఆడుకుంటూ.. చెమటలు పట్టించాలన్నా కరణ్ జోహార్ తరువాతే.. ఇక ఈ స్టార్ ప్రోడ్యూసర్ సోష‌ల్ మీడియాలో కూడా ఫుల్  యాక్టివ్‌గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడూ త‌న‌కు సంబంధించిన విష‌యాల‌తో పాటు సినిమాల వివ‌రాల‌ను పంచుకుంటూ ఉంటాడు. 

సెలబ్రెటీలు ఎక్కువగా ఉపయోగించేది ట్విట్ట‌ర్‌, ఆతరువాత ఇన్ స్టా గ్రామ్. ఇక వీటికి  పోటీగా థ్రెడ్స్ యాప్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం థ్రెడ్స్ యాప్ హ‌వా న‌డుస్తోంది. ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రెటీలు ఇందులో త‌మ ఖాతాల‌ను ప్రారంభించారు. మన టాలీవుడ్ లో కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు చాలా మంది థ్రెడ్స్ లో జాయిన్ అయ్యారు. ఇక ఈక్రమంలో తాజాగా క‌ర‌ణ్ జోహార్ కూడా థ్రెడ్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఫ్యాన్స్ తో సరదాగా మాట్లాడాలి అని భావించి... ఆస్క్ కరణ్ ఎనీథింగ్ సెషన్‌ను నిర్వ‌హించారు. 10 నిమిషాల పాటు అందుబాటులో ఉంటాన‌ని త‌న‌ను ఏవైన‌ ప్ర‌శ్న‌లు అడ‌గొచ్చని ప్రకటించాడు కరణ్ జోహార్. 

ఈక్రమంలో నెటిజన్ల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. అందులో కొన్ని ప్రశ్నలు కరణ్ జోహార్ ను ఇబ్బంది పెట్టేవిధంగా  ఉన్నాయి. అందులో ఓనెటిజన్ వేసిన ప్రశ్న అందరిని ఆశ్చర్య పరిచింది.అంతా షాక్ అయ్యేలా చేసింది. ఇంతకీ అతను ఏమని ప్రశ్నిచాడంటే...మీరు గే క‌దా.. నిజ‌మేనా..? అని క‌రుణ్‌ను ప్ర‌శ్నించాడు. త‌న అభిప్రాయాల‌ను నిర్భయంగా బ‌య‌టి చెప్పే క‌రుణ్ త‌న‌దైన శైలిలో అత‌డికి స‌మాధానం ఇచ్చాడు. “నీకు ఇంట్రెస్ట్ ఉందా..?” అని షాకింగ్  రిప్లై ఇచ్చాడు. దాంతో నెటిజన్ అడిగిన ప్రశ్న.. దానికి కరణ్ చెప్పిన సమాధానం కూడా నెట్టింట్లో హైలెట్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. ఇక ఇంత స్టఫ్ దొరికితే మన నెటిజన్లు ఊరుకుంటారా.. రకరకాల కామెంట్లతో నింపేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?