ఆ డైరక్టర్ చీర పిన్ను తీసేయ్యమన్నాడు... డ్రీమ్ గర్ల్ హేమా మాలిని షాకింగ్ కామెంట్స్...

Published : Jul 10, 2023, 07:49 AM IST
ఆ డైరక్టర్ చీర పిన్ను తీసేయ్యమన్నాడు... డ్రీమ్ గర్ల్ హేమా మాలిని షాకింగ్ కామెంట్స్...

సారాంశం

బాలీవుడ్ సీనియర్ నటి...మాజీ హీరోయిన్.. డ్రీమ్ గర్ల్.. హేమా మాలిని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ దర్శకుడు తన పైట పిన్ను తీయ్యమన్నాడంటూ.. ఆరోజుల్లో.. తన జీవితంలో జరిగిన ఓ షాకింగ్ సంఘటనను పంచుకున్నారు. 

సీనియర్ నటి, లోక్ సభ సభ్యురాలు హేమమాలిని  షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను హీరోయిన్ గా నటిస్తున్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో జరిగిన కొన్నిసంఘటనలను తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు హేమా మాలిని.  ఓ సినీ దర్శకుడి మాటల వల్ల తాను ఇబ్బంది పడ్డానని అన్నారు. షూటింగ్ లోకేషన్ లో.. అందరిముందు ఆ దర్శకుడు తన చీర పిన్ తీసేయమంటూ.. అడిగారని.. ఆ మాటలకు తాను షాక్ అయ్యానన్నారు.  ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా..పాలిటిక్స్ లో కొనసాగుతున్న హేమా మాలిని.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన సినిమా జీవితం, రాజకీయ జీవితాలకుసంబంధించిన విశేషాలు పంచుకున్నారు. 

ఈ  ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు హేమామాలినీ.. ముఖ్యంగా తన  సినీ కెరీర్, ధర్మేంద్రతో వివాహం, పిల్లలు వంటి ఆసక్తికర విషయాలపై ఆమె మాట్లాడారు. హీరోయిన్ గా తాను మంచి ఫామ్ లో ఉన్నప్పుడు తనకుఎదురైన ఓ  ఓ సంఘటన గురించి ఆమో మాట్లాడుతూ..  "ఓ సినిమా సెట్లో చోటుచేసుకున్న ఈ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు. ఆ దర్శకుడు నాపై రొమాంటిక్ యాంగిల్ లో సీన్లు షూట్ చేయాలి అనుకున్నట్టున్నాడు.. అయితే  సాధారణంగా నాకు చీర కట్టినప్పుడు పైన పైటకు పిన్ను పెట్టుకునే అలవాటు ఉంది. అయితే  ఆ సీన్ చేసేప్పుడు పైటకు పిన్ను పెట్టవద్దు అన్నాడు దర్శకుడు.. కాని పిన్ను తీసేస్తే చీర జారిపోతుంది అని అతనితో అన్నాను.  దానికి ఆయన నాకు కావాల్సిందే అదే అన్నాడు. ఆయన మాటలకు నేను కంగారుపడ్డాను అంటూ హేమా మాలిని వెల్లడించారు.  

సినిమాలకు సంబంధిచిన ఎన్నో విషయాలు పంచుకున్నారు హేమా మాలిని. తన ఫ్యామిలీ విశేషాలు కూడా మాట్లాడారు. షోలే, సీత ఔర్  గీత లాంటి సినిమాల్లో కలిసి నటించారు  హేమ-ధర్మేంద్ర.  ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడారు.  అయితే అప్పటికే పెళ్ళైన ధర్మేంద్రను 1980లో  ప్రేమ వివాహం చేసుకున్నారు హేమ. వీరికి ఇద్దరు కుమార్తెలు.. ఇక హేమా తన భర్త  గురించి మాట్లాడుతూ.. తమ కుమార్తెలకుమార్తెల విషయంలో ఆయన చాలాజాగ్రత్తగా అడుగులు వేశారన్నారు. ముఖ్యంగా వారి  పెళ్లి విషయంలో ఆయన ఎప్పుడూ కంగారుపడుతూ ఉండేవారని చెప్పారు. 

ఇక, సత్యం శివం సుదరం' సినిమా ఆఫర్ ఫస్ట్ తనకే వచ్చిందని.. అయితే అప్పటి పరిస్థితుల దృశ్య.. తాను ఆఆఫర్ ను  రిజెక్ట్ చేశానని చెప్పారు. ఇప్పటికి చాలా హుషారుగా ఉంటారు హేమా మాలినీ.. ముంబయ్ వీధుల్లో కనిపిస్తూ..అభిమానులకు పలకరిస్తారు. మెట్రో లాంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను కూడా ఉపయోగిస్తారు హేమా...సాధారణ ప్రేక్షకులతో ఇట్టే కలిసిపోతారు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today డిసెంబర్ 10 ఎపిసోడ్ : డబ్బులు ఇస్తూ బుద్ధి బయటపెట్టిన మనోజ్, వద్దని షాకిచ్చిన బాలు..!
Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు