నటి చనిపోయిందంటూ వార్తలు..!

Published : May 04, 2019, 12:40 PM IST
నటి చనిపోయిందంటూ వార్తలు..!

సారాంశం

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలపై వస్తోన్న వార్తల్లో ఏది నిజం ఏది అబద్దం అనేది తెలియకుండా పోతుంది.

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలపై వస్తోన్న వార్తల్లో ఏది నిజం ఏది అబద్దం అనేది తెలియకుండా పోతుంది. నిన్న బాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొట్టింది. అదేంటంటే.. ఒకప్పటి హీరోయిన్ ముంతాజ్ చనిపోయిందంటూ ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నాహ్తా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

గుండెపోటుతో ఆమె మరణించినట్లు చెప్పడంతో నెటిజన్లు ఆమెకి సంతాపం తెలిపారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ముంతాజ్ గారు బ్రతికే ఉన్నారంటూ బాలీవుడ్ దర్శకుడు మిలాప్ జవేరి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దీంతో వెంటనే కోమల్ నాహ్తా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు క్షమించాలని కోరారు.

అయితే కాసేపటికే ముంతాజ్ కూతురు తాన్య కూడా స్పందించి తన తల్లి ఎప్పటిలానే అందంగా, ఆరోగ్యం ఉందని చెప్పింది. అలానే తన తల్లితో ఓ వీడియో కూడా రిలీజ్ చేయించింది.

అందులో ముంతాజ్ తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు, తన కూతురితో కలిసి సంతోషంగా జీవిస్తున్నట్లు చెప్పింది. మీడియాలో తాను ఒంటరిగా ఉంటున్నట్లు, ఎవరూ పట్టించుకోవడం లేదని వస్తోన్న వార్తలను ఖండించింది ముంతాజ్.   

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: రోహిత్ రొట్టగ్యాంగ్, నోరు జారిన త్రిగుణ్, షాలినీ వర్సెస్ నీతూ, ఆరో వారం నామినేషన్స్‌లో పీక్స్‌కి చేరిన రచ్చ..
Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?