పౌరసత్వం వివాదం.. వైరల్ అవుతోన్న అక్షయ్ వీడియో!

Published : May 04, 2019, 12:11 PM IST
పౌరసత్వం వివాదం.. వైరల్ అవుతోన్న అక్షయ్ వీడియో!

సారాంశం

బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓటేయకపోవడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓటేయకపోవడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తన సినిమాలతో దేశభక్తి చాటే అక్షయ్ ఓటు మాత్రం వేయలేకపోయారంటూ ఆయనపై విమర్శలు వినిపించాయి.

ఇప్పటికీ ఈ వివాదం ముదురుతునే ఉంది. నిజానికి ఆయన ఓటు వేయకపోవడానికి కారణం అక్షయ్ కి కెనడా దేశ పౌరసత్వం ఉండడమే.. ఎట్టకేలకు ఈ విషయంపై స్పందించారు అక్షయ్. తనకు కెనడా పాస్ పోర్ట్ ఉన్న మాట నిజమేనని చెప్పిన ఆయన మాతృదేశమైన భారత్ అంటే ఎనలేని మక్కువ అని పేర్కొన్నారు.

కెనడా పౌరసత్వం విషయంలో  అనవసర రాద్దాంతం చేస్తున్నారని. గత ఏడేళ్లలో తాను ఎప్పుడూ కెనడా వెళ్లలేదని, ఇక్కడే ఉంటూ అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నానని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఆయన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

గతంలో కెనడా టొరంటోలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్.. టొరంటో తన సొంతూరు అని, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుండి రిటైర్ అయిన తరువాత ఇక్కడికే వచ్చి స్థిరపడతానని అన్నారు. దేశం మీద ప్రేమ ఉందంటూనే అక్షయ్ ద్వంద్వ వైఖరిని చాటుతున్నారని విమర్శలు చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Sowcar Janaki: ఐసీయూలో షావుకారు జానకి.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే?
Agnipariksha season 2 Review: చెత్త టాస్క్‌లతో కంపు కొడుతున్న అగ్నిపరీక్ష 2.. బిగ్ బాస్ కోసం వెళ్తే చుక్కలు చూపిస్తున్నారుగా!