కన్ఫర్మ్.. ప్రియాంక చోప్రా తమ్ముడి పెళ్లి ఆగిపోయింది!

Published : May 04, 2019, 11:55 AM IST
కన్ఫర్మ్.. ప్రియాంక చోప్రా తమ్ముడి పెళ్లి ఆగిపోయింది!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లి ఆగిపోయింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లి ఆగిపోయింది. కొద్దిరోజుల క్రితం సిద్ధార్థ్ కి అతడి స్నేహితురాలు ఇషితా కుమార్ తో నిశ్చితార్ధం జరిగింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి అనుకునేలోపు ఆ వేడుకను రద్దు చేసుకున్నారు.

ఇషితా ఆనారోగ్యంతో బాధ పడుతున్న కారణంగా ఇరు కుటుంబాలు పెళ్లి వాయిదా వేయాలని భావించారంటూ ప్రచారం జరిగిందని. అయితే తాజా సమాచారాన్ని బట్టి సిద్ధార్థ్-ఇషితాల పెళ్లి ఆగిపోయింది. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఇషితా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.

''కొత్త ఆరంభాలకు చీర్స్.. అందమైన ముగింపులకు గుడ్ బై కిస్ తో వీడ్కోలు'' అంటూ తను తీసుకున్న ఫోటోని షేర్ చేశారు. దీనిపై ఆమె తల్లి నిధి కుమార్.. ''పాత పుస్తకం మూసేయ్.. కొత్తది రచించు'' అంటూ కామెంట్ చేశారు.

''మేము ఎల్లప్పుడూ నీతోనే ఉంటాం.. విశ్వంలో వెలిగే సరికొత్త తారలా నువ్వు అవతరించాలి'' అంటూ ఇషితా తండ్రి ఆమెకి సపోర్ట్ అందించారు. ఆమె స్నేహితులు కూడా రకరకాల కామెంట్స్ చేస్తూ ఇషితాకి తన సపోర్ట్ తెలుపుతున్నారు. అయితే పెళ్లి ఆగిపోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. 

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్