ఈ యాడ్ లో అనుష్క, విరాట్ కెమిస్ట్రీ అదిరింది

Published : Sep 13, 2017, 03:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ఈ యాడ్ లో అనుష్క, విరాట్ కెమిస్ట్రీ అదిరింది

సారాంశం

అనుష్క, విరాట్ జంటగా యాడ్ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన అనుష్క, విరాట్ నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫోటోలు

భారత క్రికెట్ జట్టు సారధి కొహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు  గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరిపై మీడియా ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. అందుకే.. వారు ఎంత సీక్రెట్ గా కలుసుకుందామని ప్రయత్నించినా.. చివరికీ మీడియాకు దొరికిపోతారు.

 

ఇక అసలు విషయానికి వస్తే.. విరాట్, అనుష్క ఇద్దరూ కలిసి ఒక ప్రకటనలో కలిసి నటించారు. గతంలో ఓ షాంపూ ప్రకటన కోసం వీరిద్దరూ కలిసి నటించిన వీరు ఈ సారి ఓ వస్త్ర దుకాణా ప్రకటన కోసం కలిసి నటించారు. ఓ ప్రముఖ వస్త్ర దుకాణానికి విరాట్ కొహ్లీ.. బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం పండగ సీజన్ నడుస్తోంది.ఈ సందర్భంగా ఆ వస్త్ర దుకాణ నిర్వాహకులు విరాట్ తో పాటు అనుష్కని కూడా కలిపి ప్రచారం చేయిస్తున్నారు. ఈ మేరకు వీరు చేసిన యాడ్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

 

ఈ ఫొటోలకు నెటిజన్లు తమ కామెంట్లను జత చేస్తున్నారు. ‘సంప్రదాయ దుస్తుల్లో కోహ్లీ-అనుష్క జంట చూడముచ్చటగా ఉంది, మీ ఇద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు’, ‘బ్యూటిఫుల్‌ కపుల్‌’, ‘ఎంత బాగున్నారో’ అంటూ మురిసిపోయారు.

 

2013లో వీరిద్దరూ ఓ షాంపూ యాడ్‌ కోసం తొలిసారి జంటగా నటించిన సంగతి తెలిసిందే. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అనేక సందర్భాల్లో అనుష్కపై ఉన్న ప్రేమను కోహ్లీ వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. ఇటీవల విరాట్‌ శ్రీలంక పర్యటనలో ఉన్న సమయంలోనూ అనుష్క అక్కడికి వెళ్లింది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే