వావ్..హీరో నితిన్ ని సర్ప్రైజ్ చేసిన ఎంఎస్ ధోని.. ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ కి లెజెండ్ నుంచి స్పెషల్ గిఫ్ట్

By Asianet NewsFirst Published Nov 29, 2023, 2:11 PM IST
Highlights

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రమోషన్స్ కి ఎక్స్ట్రా జోష్ ఇస్తూ క్రికెట్ లెజెండ్, మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోని నితిన్ ని సర్ప్రైజ్ చేశారు.

హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. నితిన్ సరసన క్రేజీ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. డిసెంబర్ 8న ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో జోరుగా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కూడా కంప్లీట్ ఫన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటోంది. 

ఈ చిత్రంలో ఎక్స్ట్రా స్పెషల్ రోల్ కూడా ఉంది. కీలక పాత్రలో యాంగ్రీ హీరో రాజశేఖర్ నటిస్తున్నారు. జీవితం.. జీవిత నాకు రెండూ ఒక్కటే అంటూ రాజశేఖర్ చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Latest Videos

ఇదిలా ఉండగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రమోషన్స్ కి ఎక్స్ట్రా జోష్ ఇస్తూ క్రికెట్ లెజెండ్, మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోని నితిన్ ని సర్ప్రైజ్ చేశారు. నితిన్ కి తాను సైన్ చేసిన టీ షర్ట్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. ధోని ఇచ్చిన గిఫ్ట్ ని నితిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ అంతా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. 

EXTRAORDINARY gift from an EXTRAORDINARY MAN… Thankuu sir for this!! Love u ❤️ pic.twitter.com/dNTeXl1JOe

— nithiin (@actor_nithiin)

అసలు నితిన్ ఎప్పుడు ఎక్కడ ధోనిని కలిశారు అంటూ ఆశ్చర్యపోతున్నారు. నితిన్ ధోనిని కలిశారా లేక ధోని నితిన్ కి గిఫ్ట్ పంపారా అనేది తెలియదు. ఏది ఏమైనా ధోని ఇలా నితిన్ కి గిఫ్ట్ ఇవ్వడం ఎక్స్ట్రా చిత్రానికి ఎక్స్ట్రా బూస్ట్ అనే చెప్పాలి. 

Also Read: అన్నయ్య పెళ్లి తర్వాత నిహారికలో జోష్ చూశారా.. ఇంటెన్స్ లుక్స్ తో మరింత రెచ్చిపోతున్న మెగా డాటర్, వైరల్

నితిన్ ఈ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. నితిన్ తండ్రిగా రావు రమేష్ నటిస్తున్నారు. రాజశేఖర్ పోషిస్తున్న పాత్ర ఏంటనేది సస్పెన్స్. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖిత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Also Read: జబర్దస్త్ ఖుష్బూ లిప్ కిస్ అప్పట్లోనే సంచలనం..ఆ హీరోలతో రమ్యకృష్ణ, అనుష్క, ఛార్మి, డింపుల్ క్రేజీ లిప్ లాక్స్

click me!