మార్కెట్ లోకి #Salaar షర్ట్స్, రేటు ఎంతంటే...

By Surya PrakashFirst Published Nov 29, 2023, 12:40 PM IST
Highlights

ప్రభాస్ ఫ్యాన్స్ వీటిని ఆన్ లైన్ లో కొంటున్నారు. హోంబలే వెర్సెస్ వెబ్ సైట్లో ఈ షర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. 


కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్న   #Salaar చిత్రం  యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రెండు పార్టులుగా వస్తోంది. Salaar Part-1 Ceasefire డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్‌ ఈవెంట్‌ను రెడీ చేసుకుంటుంది ప్రభాస్‌ టీమ్. మరో ప్రక్క ప్రమోషన్ మెటీరియల్ ని వదులుతున్నారు. ఈ క్రమంలో మార్కెట్లో సలార్ టీ షర్ట్స్ ని వదిలింది నిర్మాణ సంస్ద.

Rebel fans, this one’s for you! 💥 presents the Inaugural Offer – Buy one get one FREE on exclusive merchandise.
- https://t.co/T9sVOpd3h2 pic.twitter.com/QXeC9TAzE6

— Hombale Films (@hombalefilms)

ప్రభాస్ ఫ్యాన్స్ వీటిని ఆన్ లైన్ లో కొంటున్నారు. హోంబలే వెర్సెస్ వెబ్ సైట్లో ఈ షర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. టీషర్ట్, హూడీ, హార్మ్ స్లీవ్స్ కొనుగోలు చేయవచ్చు. టీషర్ట్స్ కావాలనుకున్న ఫ్యాన్స్ హోంబలే వెర్సెస్ వెబ్ సైట్ లో కొనుగోలు చేయవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే..రూ.499 నుంచి ప్రారంభమై రూ.1499 వరకు ఉన్నాయి.  

Latest Videos

ఇక బద్ధ శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథే సలార్ అని డైెరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పేశారు. సలార్ సినిమాకు ఫ్రెండ్‍షిప్ ముఖ్యమైన ఎమోషన్ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “శత్రువుగా మారిన ఇద్దరు స్నేహితుల కథే సలార్. సలార్‌లో ఫ్రెండ్‍షిప్ కోర్ ఎమోషన్. సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్‌లో సగం కథే చెబుతాం. సలార్ మొత్తం కథను రెండు సినిమాలుగా చూపిస్తాం. మేం సృష్టించిన ప్రపంచాన్ని ట్రైలర్లో ప్రేక్షకులు చూస్తారు” అని ప్రశాంత్ నీల్ చెప్పారు. సలార్ ట్రైలర్ డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 7 గంటల 19 నిమిషాలకు రిలీజ్ కానుంది.  
 
బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు  తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అందుకు కారణం ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్. అలాగే ఆయన క్రేజీ కాంబినేషన్స్.  ఈ క్రమంలో ఈ డిసెంబర్ లో రాబోతున్న ప్రభాస్ సలార్ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి.   ఈ సినిమాకి కేజీఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో, ఖచ్చితంగా ఈ చిత్రం తప్పకుండా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్మకంతో ఉంది ట్రేడ్. దాంతో డిసెంబర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా షారుక్ ఖాన్ దుంకి సినిమాతో పోటీ పడాల్సి ఉన్నా కూడా లెక్క చేయటం లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ కుమ్మేస్తున్నారు. 
  
సలార్‌గా ప్రభాస్, విలన్ వరదరాజ్ మన్నార్‌గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ కాగా.. జగపతి బాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రీయా రెడ్డి, రామచంద్ర రాజు కీలకపాత్రలు పోషించారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
 

click me!