
తెలుగు సీతగా పాపులర్ అయ్యింది మృణాల్ ఠాకూర్. `సీతారామం` చిత్రంలో ఆమె సీతా మహాలక్ష్మిగా అద్భుతమైన నటనతో మెప్పించింది. టాలీవుడ్‌లో లేటెస్ట్ సీతగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత `హాయ్ నాన్న`తో మరోసారి మెప్పించింది. తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యింది. కానీ ఇటీవల `ఫ్యామిలీ స్టార్`తో పరాజయాన్ని చవిచూసింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో డిజప్పాయింట్ చేసింది. మృణాల్‌కి తెలుగులో తొలి బ్యాక్ ఫైర్ గా మారింది.
అయితే ఈ బ్యూటీకి మాత్రం ఆఫర్లు బాగానే వస్తున్నాయి. తమిళం, హిందీలోనూ అవకాశాలను సొంతం చేసుకుంటూ బిజీ అవుతుంది. అందులో భాగంగా మృణాల్‌కి ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో ఆఫర్ వచ్చిందట. తమిళంలో `కాంచన`లో నటిస్తుందనే ప్రచారం జరుగుతుంది. `కాంచన` సిరీస్‌లో భాగంగా ఇప్పటికే మూడు సినిమాలు వచ్చి పెద్ద హిట్ అయ్యాయి. హర్రర్ కామెడీగా దర్శకుడు రాఘవ లారెన్స్ తెరకెక్కించి హిట్ కొట్టాడు. ఇప్పుడు నాల్గో సిరీస్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
అందులో భాగంగా `కాంచన 4`ని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తలు ఇటీవలే ప్రారంభం అయ్యాయి. అయితే.. ఇందులో కాంచనగా మృణాల్ ఠాకూర్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అందంతో, అభినయంతో అలరించిన మృణాల్ దెయ్యంగా మెరవబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతోపాటు ఒకరిద్దరు హీరోయిన్ల పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా దీనిపై రాఘవ లారెన్స్ స్పందించారు. ఆయన సోషల్ మీడియా ద్వారా ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు కాస్టింగ్‌కి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలన్నీ కేవలం రూమర్లు మాత్రమే, త్వరలో ఆ వివరాలను తామే రాఘవేంద్ర ప్రొడక్షన్ నుంచి ప్రకటిస్తామని తెలిపారు.
కాంచనగా మృణాల్ కనిపిస్తుందనే వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పకనే చెప్పారు. మరి ఈ నాల్గో కాంచనగా ఏ బ్యూటీ మెప్పిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే రాఘవ లారెన్స్ హీరోగా బిజీగా ఉంటున్నాడు. హీరోగా వరుస సినిమాలు వస్తున్న నేపథ్యంలో దర్శకత్వానికి బ్రేక్ ఇచ్చారు. కానీ ఆయన హీరోగా వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేస్తున్నాయి. దీంతో మళ్లీ తనకు లైఫ్ ఇచ్చిన `కాంచన`తో రాబోతున్నారు లారెన్స్.