`విశ్వంభర`లో మృణాల్‌ ఠాకూర్‌, మీనాక్షి చౌదరి..? చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌..?

Published : Mar 04, 2024, 06:42 PM IST
`విశ్వంభర`లో మృణాల్‌ ఠాకూర్‌, మీనాక్షి చౌదరి..? చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌..?

సారాంశం

చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో కాస్టింగ్‌ అమాంతం పెరిగిపోతుంది. హీరోయిన్లు యాడ్‌ అవుతున్నారు. తాజాగా ఇద్దరు స్టార్‌ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి.   

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ ఎలిమెంట్లతో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో చిరంజీవి ఒక వీరుడి పాత్రని పోషిస్తున్నట్టు తెలుస్తుంది.  `బింబిసార` ఫేమ్‌ వశిష్ట ఈ మూవీని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన షాకింగ్‌ విషయాలు వినిపిస్తున్నాయి. ఇందులో కాస్టింగ్‌ రోజు రోజుకి మరింతగా పెరిగిపోతుంది. 

`విశ్వంభర`లో చిరంజీవికి జోడీగా త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమెతోపాటు మరో ఐదుగురు హీరోయిన్లు కనిపిస్తారట. అందులో ముగ్గురు సిస్టర్స్ రోల్స్ అని తెలుస్తుంది. అందుకోసం ఆషికా రంగనాథ్‌, ఇషా చావ్లా, సురభి ఎంపికయ్యారట. ఆల్‌రెడీ వీళ్లపై షూటింగ్‌ జరుగుతుందట. ఆదివారం నుంచే ఈ చిత్రీకరణ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. 

వీరితోపాటు మరో ఇద్దరు స్టార్‌ హీరోయిన్లు కనిపించబోతున్నారట. అందులో మృణాల్‌ ఠాకూర్‌ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆమెతోపాటు మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే వీరిది గెస్ట్ రోల్స్ అని టాక్‌. కొమియో పాత్రల్లో ఈ ఇద్దరు భామలు కనిపిస్తారట. వీరితోపాటు రాజ్‌ తరుణ్‌, నవీన్‌ చంద్ర పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇలా భారీ కాస్టింగ్‌ యాడ్‌ అవుతూ సినిమా స్థాయిని పెంచేస్తున్నారు చిరు, వశిష్ట. 

ఈ సినిమా బడ్జెట్‌ సైతం భారీగా పెరుగుతుందట. చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌ పెట్టబోతున్నారట. యూవీ క్రియేషన్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. వీఎఫ్‌ఎక్స్, భారీ కాస్టింగ్‌ ఉన్న నేపథ్యంలో సినిమా బడ్జెట్‌ రెండు వందల కోట్లు దాటుతుందని తెలుస్తుంది. ఇది మెగాస్టార్‌ కెరీర్‌లోనే అత్యధికమని చెప్పొచ్చు, ఇంకా చెప్పాలంటే డబుల్‌ అని చెప్పొచ్చు. చిరంజీవి నటించిన `వాల్తేర్‌ వీరయ్య`, `భోళాశంకర్‌`, `గాడ్‌ ఫాదర్‌`, `సైరా` చిత్రాలు 100-120కోట్లు దాటలేదు. ఇప్పుడు చాలా పెరిగిపోతుంది.

 మరి దీన్ని ఎలా హ్యాండిల్‌ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కంటెంట్‌ పరంగా సినిమా భారీ బడ్జెట్‌ని కోరుకుంటుంది, పెట్టడంలో తప్పులేదు, కానీ మార్కెట్‌ లెక్కలు ఏ మేరకు వర్కౌట్‌ అవుతాయనేది సస్పెన్స్ గా మారింది. మేకర్స్ చాలా సాహసం చేస్తున్నారనే చెప్పాలి. ఇది మెగాస్టార్‌ మార్కెట్‌కి, ఇమేజ్‌కి పరీక్షలాంటి చిత్రమే అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో