మరో పెద్ద సినిమా సైన్ చేసిన మహేష్ హీరోయిన్

Published : Mar 04, 2024, 06:22 PM IST
 మరో పెద్ద సినిమా సైన్ చేసిన మహేష్ హీరోయిన్

సారాంశం

ఆకట్టుకునే అందం, అభినయంతో  ఒక వైపు యంగ్ స్టార్స్ పక్కన, మరో పక్క సీనియర్ హీరోలతో ఆఫర్స్ అందిపుచ్చుకుంటోంది.

మహేష్ బాబు సరసన గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన మీనాక్షి చౌదరి.. ని మర్చిపోవటం కష్టమే. మీనాక్షిని మరీ అంత చిన్న క్యారెక్టర్ లో చూపెట్టినా ఆమె మాత్రం తనదైన ముద్ర వేసింది. అంతెందుకు సినిమాలో ఒక పాటలో కూడా మీనాక్షి కనిపించలేదు. అయితే అమ్మడికి వరుస ఆఫర్లు మాత్రం తెలుగులో వస్తూనే ఉన్నాయి. చూస్తూంటే  మీనాక్షి చౌదరి సౌత్ లో వెలిగిపోయేలాగే ఉంది. ఓ ప్రక్కన తమిళ స్టార్ హీరో విజయ్ తో GOAT సినిమాలో నటిస్తూ ఉంది మీనాక్షి.   గోట్ తర్వాత, ఆమె వరుణ్ తేజ్ మట్కా.. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాలలో నటిస్తూ ఉంది. ఇక విశ్వక్ సేన్‌తో ఒక చిత్రంలో కనిపించనుంది. ఇప్పుడు మరో పెద్ద సినిమా కమిటైంది. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం  ప్రకారం ఈ మూవీలో  వెంకీ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.  ప్రస్తుతం  నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. F2  సినిమాలానే ఈ మూవీ కూడా  అన్ని వర్గాల వారి ని అలరిస్తుందని, వెంకీకి మరో హిట్ గ్యారంటీ అని నమ్మకంగా దర్శక,నిర్మాతలు నమ్మకంగా  ఉన్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ ని అనిల్ రావిపూడి ఇప్పటికే ఫైనల్  చేసినట్లు  తెలుస్తోంది.  ఈ మధ్యే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారు. 'సంక్రాంతికి వస్తున్నాం' అని టైటిల్ ఫిక్స్ చేశారు. 

ఇక సైందవ్ సినిమాతో సంక్రాంతి బరిలో దిగిన వెంకటేష్ ప్రేక్షకులని మెప్పించలేకపోయారు. నెక్స్ట్ F2 , F3 లాంటి హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి తో ఒక సినిమాకి కమిట్ అయ్యారు. వెంకీ కెరీర్ కి ఇది 76 వ సినిమా. ఈ మూవీ కామెడీ అండ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డీటెయిల్స్ త్వరలో అధికారికంగా రానున్నాయని తెలుస్తోంది. ఏదైమైనా ఆకట్టుకునే అందం, అభినయంతో  ఒక వైపు యంగ్ స్టార్స్ పక్కన, మరో పక్క సీనియర్ హీరోలతో ఆఫర్స్ అందిపుచ్చుకుంటోంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?