నాగార్జున మాజీ కోడలు అంటూ.. సమంతని ఎన్ కన్వెన్షన్ వివాదంలోకి లాగిన ఎంపీ, షాకింగ్ కామెంట్స్

By tirumala AN  |  First Published Aug 25, 2024, 3:48 PM IST

పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎన్ కన్వెన్షన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకుని చెరువు భూమిని గుర్తించాలని 2014 లో హై కోర్టు ఆదేశించింది.


నాగార్జున ఎన్ కన్వెన్షన్ వివాదం బాగా ముదురుతోంది. శనివారం రోజు తెలంగాణ ప్రభుత్వం మాదాపూర్ లో నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ని నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. తమ్మిడి తమ్మిడి కుంట చెరువులో కొన్ని ఎకరాలు కబ్జా చేసి నాగార్జున ఈ ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నట్లు ప్రధాన ఆరోపణ ఉంది. 

హైడ్రా అధికారులు ఆధారాలతో శనివారం రోజు ఎన్ కన్వెన్షన్ ని భారీ బందోబస్తు నడుమ కూల్చివేశారు. ఇది చట్ట విరుద్ధం అంటూ నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత మరింత రాజకీయ చర్చ మొదలయింది. బిజెపి ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Latest Videos

undefined

పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎన్ కన్వెన్షన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకుని చెరువు భూమిని గుర్తించాలని 2014 లో హై కోర్టు ఆదేశించింది. దీనిపై అప్పటి మంత్రి కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పదేళ్లు మౌనంగా ఉన్నారు. 

నాగార్జున మాజీ కోడలు సమంతని తీసుకువచ్చి తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. దాని వెనుక ఆంతర్యం ఏంటి అంటూ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనితో ఆయన ఈ వివాదంలోకి సమంతని కూడా లాగినట్లు అయింది. 

అదే విధంగా పద్మాలయ స్టూడియో, లాంకో హిల్స్ విషయంలో కూడా వివాదాలు ఉన్నాయని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఇన్నేళ్ళలో ఎన్ కన్వెన్షన్ ఒక్కో ఫంక్షన్ కి 50 లక్షల నుంచి కోటి రూపాయలు వసూలు చేసింది. ఆ డబ్బంతా తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు చేరేలా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలి అని రఘునందన్ రావు అన్నారు. 

click me!