పుష్ప మూవీపై పవన్ కళ్యాణ్ తన కామెంట్స్ వెనక్కి తీసుకోవాలి.. అల్లు స్నేహ తండ్రి సంచలన వ్యాఖ్యలు

By tirumala AN  |  First Published Aug 25, 2024, 12:23 PM IST

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఇటీవల బెంగుళూరులో పర్యటించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ స్మగ్లర్లని హీరోలుగా చూపించడం ప్రస్తుతం ట్రెండ్ అయిపోయింది అని పవన్ కళ్యాణ్ అన్నారు.


మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య వివాదం కాస్త ఎక్కువగానే ఉన్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు దీనిపై ఇరు కుటుంబాలకి చెందిన వారు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య వివాదం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. 

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఇటీవల బెంగుళూరులో పర్యటించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ స్మగ్లర్లని హీరోలుగా చూపించడం ప్రస్తుతం ట్రెండ్ అయిపోయింది అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకప్పుడు హీరోలు అడవులని రక్షించే యోధుల పాత్రల్లో నటించారు. కానీ ఇప్పుడు స్మగ్లర్లుగా నటిస్తున్నారు అంటూ పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 

Latest Videos

అంతకు ముందు అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి తనఎన్నికల్లో తన స్నేహితుడు, వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతు తెలపడం మెగా అభిమానులకు నచ్చలేదు. అదొక వివాదం అయింది. ఇలా వరుస సంఘటనలతో మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య ఏదో జరుగుతోంది అనే అనుమానాలు పెరుగుతున్నాయి. 

అయితే తాజాగా అల్లు అర్జున్ మావయ్య, అల్లు స్నేహ తండ్రి చంద్ర శేఖర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప చిత్రంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలని ఆయన ఖండించారు. అల్లు అర్జున్ ఒక నటుడిగా పుష్ప చిత్రంలో నటించాడు. బన్నీ రియల్ లైఫ్ లో ఎలాంటి తప్పు చేయలేదు కదా. అల్లు అర్జున్నిజంగా ఎర్ర చందనం స్మగ్లింగ్ వ్యాపారం చేస్తే అది తప్పు. 

ఒక సినిమాలో నటుడిగా నటిస్తే తప్పేముంది. దయచేసి పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలని పెద్ద మనసుతో వెనక్కి తీసుకోవాలి. లేదా తాను చేసిన కామెంట్స్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి కాదు అని చెప్పాలి.పుష్ప చిత్రాన్ని అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారా అంటూ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వివాదంలోకి నెమ్మదిగా కుటుంబ సభ్యులు కూడా ఎంటర్ కావడం సంచలనంగా మారుతోంది. 

click me!