హీరోయిన్ ని చుట్టుముట్టిన ఆకతాయిలు.. ఎక్కడపడితే అక్కడ తాకుతూ, వీడియో వైరల్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 10, 2021, 03:51 PM IST
హీరోయిన్ ని చుట్టుముట్టిన ఆకతాయిలు.. ఎక్కడపడితే అక్కడ తాకుతూ, వీడియో వైరల్

సారాంశం

అభిమానుల నుంచి సెలెబ్రెటీలకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తప్పవు. తమ అభిమాన నటుడినో, నటినో కలుసుకునేందుకు దూసుకు వచ్చేంస్తుంటారు. చాలా సందర్భాల్లో అభిమానుల మధ్య సెలెబ్రిటీలు చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు చూశాం.

అభిమానుల నుంచి సెలెబ్రెటీలకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తప్పవు. తమ అభిమాన నటుడినో, నటినో కలుసుకునేందుకు దూసుకు వచ్చేంస్తుంటారు. చాలా సందర్భాల్లో అభిమానుల మధ్య సెలెబ్రిటీలు చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు చూశాం. ముఖ్యంగా హీరోయిన్లకు ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఎదురవుతుంటాయి. కొందరు ఆకతాయిలు సెక్యూరిటీ వలయాలని దాటుకుని కూడా వచేస్తుంటారు. 

ఇక హీరోయిన్లు పబ్లిక్ గా కనిపిస్తే అంతే సంగతులు. అభిమానం పేరుతో ఆకతాయిలు మీద పడిపోతారు. అలాంటి చేదు అనుభవం బాలీవుడ్ అందాల భామ మౌని రాయ్ కి తాజాగా ఎదురైంది. బాలీవుడ్ చిత్రాలతో పాటు నాగిన్ టీవీ సిరీస్ తో కూడా మౌని రాయ్ పాపులర్ అయింది. 

జుహు ప్రాంతంలో మౌని రాయ్ ఓ రికార్డింగ్ స్టూడియో వద్దకు వెళ్ళింది. అక్కడ మౌని రాయ్ కారు దిగగానే కొందరు అభిమానులు ఆకతాయి చేష్టలు చేశారు. సెల్ఫీల వంకతో ఆమెని ఇబ్బందికరంగా టచ్ చేసే ప్రయత్నం చేశారు. ఓ వ్యక్తి అయితే మౌని రాయ్ దగ్గరకు వెళ్లి ఆమెని టచ్ చేయబోయాడు. దీనితో మౌని రేయ్ చేతులు అడ్డం పెట్టుకుని ఏంటి ఇది అని అతడిని వారించింది. 

Also Read: చిరుత డ్రెస్ లో బ్రీత్ టేకింగ్ హాట్.. ఇంతటి అందాల ఘాటు మలైకాకి మాత్రమే సాధ్యం

ఇబ్బంది పడుతూనే సెల్ఫీలకు ఫోజు ఇచ్చింది. ఎలాగోలా వారి నుంచి బయట పడ్డ మౌని రాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే మౌని రాయ్ భారీ బడ్జెట్ చిత్రం 'బ్రహ్మాస్త్ర'లో నటిస్తోంది. అలాగే నాగిన్ 6 టివి సిరీస్ కూడా చేస్తోంది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మౌని రాయ్ హాట్ హాట్ ఫోజులతో యువతకు చేరువవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కనీసం మహిళా సెలెబ్రిటీల విషయంలో అయినా అభిమానులు బాధ్యతగా ఉండాలి అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?
Savitri: మహానటి జీవితం నాశనం కావడానికి జెమినీ గణేషన్‌, పొలిటీషియన్‌ మాత్రమే కాదు, ఆ మూడో వ్యక్తి ఇతడేనా?