అవినాష్ కాళ్ళు పట్టుకున్న మోనాల్,  కారణం తెలిస్తే షాకే

Published : Dec 02, 2020, 10:28 PM IST
అవినాష్ కాళ్ళు పట్టుకున్న మోనాల్,  కారణం తెలిస్తే షాకే

సారాంశం

ఎక్కువ పాలు సేకరించడానికి ఇంటి సభ్యులు అందరూ ఆవు బొమ్మ దగ్గర తోపులాటకు దిగారు. ఈ క్రమంలో మోనాల్ అవినాష్ ని కాలితో తన్నింది. దీనికి అవినాష్ చాలా ఫీలయ్యాడు. ఈ విషయంలో అఖిల్, సోహైల్ కూడా మోనాల్ కి మద్దతుగా నిలవడం, అవినాష్ ని మరింత ఆవేదనకు గురిచేసింది. ఐతే ఈ విషయంలో సోహైల్, అభిజిత్ మధ్య డిస్కషన్ జరిగింది. 

బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే అవకాశం ఇచ్చారు. దశల వారీగా బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ లలో గెలిచి, చివరి వరకు ఉన్న ఒక కంటెస్టెంట్ నేరుగా ఫైనల్ కి చేరుకునే అవకాశం ఇచ్చాడు. దీనిలో భాగంగా బిగ్ బాస్ నిన్న ఒక టాస్క్ నిర్వహించాడు. గార్డెన్ ఏరియాలో ఉంచిన ఆవు బొమ్మ నుండి పాలు సేకరించాలని, మూడు బజర్స్ మోగే సమయానికి ఎక్కువ పాలు సేకరించిన నలుగురు సభ్యులు తదుపరి దశకు వెళతారని చెప్పాడు. 

ఈ టాస్క్ లో ఎక్కువ పాలు సేకరించడానికి ఇంటి సభ్యులు అందరూ ఆవు బొమ్మ దగ్గర తోపులాటకు దిగారు. ఈ క్రమంలో మోనాల్ అవినాష్ ని కాలితో తన్నింది. దీనికి అవినాష్ చాలా ఫీలయ్యాడు. ఈ విషయంలో అఖిల్, సోహైల్ కూడా మోనాల్ కి మద్దతుగా నిలవడం, అవినాష్ ని మరింత ఆవేదనకు గురిచేసింది. ఐతే ఈ విషయంలో సోహైల్, అభిజిత్ మధ్య డిస్కషన్ జరిగింది. కాలితో తన్నడం చాలా తప్పని, నిజంగా మోనాల్ అది చేస్తే కొరుకునేది లేదన్నాడు. ఈ విషయంలో మొదట మోనాల్ నేను డబ్బాను తన్నానని అబద్దం చెప్పింది. గట్టిగా అడగడంతో నాకు క్లారిటీ లేదని చెప్పింది. 

ఈ సంఘటన ప్రేక్షకులలో తనకు చెడ్డ పేరు తెస్తుందని భావించిన మోనాల్, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. దీని కోసం మోనాల్ దగ్గరకు వచ్చి, కావాలని చేయలేదని సారీ చెప్పింది. అలాగే మోనాల్ అవినాష్ కాళ్ళు పట్టుకోబోయింది. దానికి అవినాష్ ఒప్పుకోలేదు. నువ్వు ఇలా చేసి నన్ను విలన్ చేయకు అని అన్నాడు. మొత్తంగా అవినాష్ ని తన తెలివి తేటలతో కూల్ చేసే ప్రయత్నం చేసింది. 

PREV
click me!

Recommended Stories

Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?