హారిక ఫైటింగ్ స్పిరిట్...బాయ్స్ కి పోటీ ఇస్తూ దూసుకెళుతుందిగా

Published : Dec 02, 2020, 03:56 PM IST
హారిక ఫైటింగ్ స్పిరిట్...బాయ్స్ కి పోటీ ఇస్తూ దూసుకెళుతుందిగా

సారాంశం

బిగ్ బాస్ ఇంటి సభ్యులు పాల కోసం ఫిజికల్ ఫైట్ కి దిగారు. కఠినమైన ఈ టాస్క్ లో నాలుగవ స్థానంలో నిలిచి హారిక రెండవ దశకు చేరింది. ఈ టాస్క్ లో మోనాల్, అవినాష్ మరియు అరియాన ఓడిపోయారు. అఖిల్, అభిజిత్, సోహైల్ మరియు హారిక రెండవ దశకు చేరారు. ఈ నలుగురిలో ఒకరు ఫినాలే మెడల్ గెలుచుకొనే అవకాశం ఉంది.


గత నాలుగు వారాలుగా ఫైటింగ్ స్పిరిట్ తో టైటిల్ రేస్ లో ముందుకు వచ్చింది దేత్తడి హారిక. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఏడుగురు సభ్యులలో హారిక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యారు. టాప్ ఫైవ్ కి బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న హారిక టైటిల్ కోసం కూడా పోరు మొదలెట్టారు. బిగ్ బాస్ ఇస్తున్న కఠినమైన టాస్క్ లలో బాయ్స్ తో పోటీపడుతూ సత్తా చాటుతున్నారు. 

నిన్న జరిగిన టికెట్ టు ఫినాలే టాస్క్ లో శక్తిమేర పోరాడి రెండవ దశకు చేరారు. ఇంటిలో ఉన్న ఒక సభ్యుడు నేరుగా ఫైనల్ కి చేరే అవకాశం బిగ్ బాస్ కల్పించాడు. దీని కోసం దశల వారీగా బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ లలో గెలిచి, చివరి వరకు నిలిచినవారు ఫినాలే మెడల్ అందుకోవచ్చని చెప్పారు. దీనిలో భాగంగా మొదటి టాస్క్ గా గార్డెన్ లో ఉన్న ఆవు బొమ్మ నుండి పాలు సేకరించాలని కోరాడు. నిర్ణీత సమయంలో అధికంగా పాలు సేకరించిన నలుగురు సభ్యులు, రెండవ దశకు చేరుకుంటారని చెప్పారు. 

ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు పాల కోసం ఫిజికల్ ఫైట్ కి దిగారు. కఠినమైన ఈ టాస్క్ లో నాలుగవ స్థానంలో నిలిచి హారిక రెండవ దశకు చేరింది. ఈ టాస్క్ లో మోనాల్, అవినాష్ మరియు అరియాన ఓడిపోయారు. అఖిల్, అభిజిత్, సోహైల్ మరియు హారిక రెండవ దశకు చేరారు. ఈ నలుగురిలో ఒకరు ఫినాలే మెడల్ గెలుచుకొనే అవకాశం ఉంది. రెండవ దశకు చేరిన నలుగురు సభ్యులలో ముగ్గురు మగవాళ్ళు కాగా హారిక ఒక్కటే ఫీమేల్ కంటెస్టెంట్. మొత్తంగా హారిక ఆట తీరుకు ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్