ప్రస్తుతం వియన్ ఆదిత్య దర్సకత్వంలో సినిమా చేస్తున్న సునీల్..త్వరలో ఓ సినిమాని డైరక్ట్ చేయటానికి రంగం రెడీ చేసుకున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఓ మరాఠి సినిమా రీమేక్ ఆయన డైరక్షన్ లో తెలుగులో రానుంది. సునీల్ కు చెందిన ఓ నిర్మాత ఆ చిత్రం రైట్స్ తీసుకున్నారు. సునీల్..ఆయన టీమ్ కలిసి ఆ సినిమా స్క్రిప్టు పై వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన రానుంది. వచ్చే సంవత్సరం 2021 ప్రారంభంలో ఈ సినిమా పట్టాలు ఎక్కునుంది.
కామెడీ రోల్స్ నుంచి హీరోగా మారిన సునీల్ మంచి విజయాలు అందుకున్నాడు. కానీ ఆ తర్వాత అతడికి వరస పరాజయాలు ఎదురయ్యాయి. మళ్లీ కామెడీ రోల్స్ వేస్తే కానీ, అతడి కెరీర్ లెవల్ కాలేదు. కాగా ప్రస్తుతం విలన్ పాత్రలు మీద ఫోకస్ పెట్టిన అతడు కలర్ ఫోటో సినిమాతో విలన్ గానూ చేసారు. ఇప్పుడు డైరక్టర్ గానూ మనని పలకరించబోతున్నారు. వివరాల్లోకి వెళితే..
సునీల్.. హాస్య నటుడుగా ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే హీరోగా వెళ్లి ఇమేజ్ పాడు చేసుకున్నాడు. ఆ విషయం ఆయనకు తెలుసు. సునీల్ అంటే ఓ బ్రాండ్ అనే స్దాయి నుంచి ఆయన సినిమాలు రాడ్ అనే సిట్యువేషన్ కు వచ్చారు. ఒకప్పుడు ఆయన తెరపై కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు.కానీ హీరో అయ్యాక ఆయన ఫెయిల్యూర్స్ చూసి సినిమా వాళ్లు తెర వెనక నవ్వులే నవ్వులు. దాంతో ఆ పరిస్థితి మరీ దారుణంగా తయారవకముందే మేలుకున్నాడు.విలన్ గానూ చేస్తూ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతూ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే సునీల్ కు ఓ తీరని కోరిక ఉంది. అది సినిమా డైరక్ట్ చేయటం. ఆ కోరిక కూడా త్వరలో నెరవేరబోతోంది. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం వియన్ ఆదిత్య దర్సకత్వంలో సినిమా చేస్తున్న సునీల్..త్వరలో ఓ సినిమాని డైరక్ట్ చేయటానికి రంగం రెడీ చేసుకున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఓ మరాఠి సినిమా రీమేక్ ఆయన డైరక్షన్ లో తెలుగులో రానుంది. సునీల్ కు చెందిన ఓ నిర్మాత ఆ చిత్రం రైట్స్ తీసుకున్నారు. సునీల్..ఆయన టీమ్ కలిసి ఆ సినిమా స్క్రిప్టు పై వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన రానుంది. వచ్చే సంవత్సరం 2021 ప్రారంభంలో ఈ సినిమా పట్టాలు ఎక్కునుంది.
దాంతో సునీల్ వేరే సినిమాలకు డేట్స్ ఇవ్వటం లేదని వినికిడి. ఆ సినిమా ఫూర్తి ఫన్ తో ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఆ సినిమాలో సునీల్ హీరోగా నటిస్తారా వేరే వాళ్లకు అవకాసం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే సునీల్ మాత్రం హీరోగా చెయ్యకపోయినా ఓ కీలకమైన పాత్ర పోషించాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే డైరక్షన్, అటు నటన రెండూ తొలి సినిమాగా చేస్తే కష్టమవుతుందని భావిస్తున్నారట.