మోహన్ లాల్ హడావిడి చూశారా..?

Published : Dec 14, 2018, 11:13 AM IST
మోహన్ లాల్ హడావిడి చూశారా..?

సారాంశం

ప్రస్తుతం ఇతర భాషల చిత్రాలు తెలుగులో అలానే మన సినిమాలు ఇతర భాషల్లో విడుదలవుతుండడంతో సౌత్ సినిమాల మధ్య భాషా భేదం పోయింది. అనువాద చిత్రాలకు వేరే రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ దక్కుతోంది. 

ప్రస్తుతం ఇతర భాషల చిత్రాలు తెలుగులో అలానే మన సినిమాలు ఇతర భాషల్లో విడుదలవుతుండడంతో సౌత్ సినిమాల మధ్య భాషా భేదం పోయింది. అనువాద చిత్రాలకు వేరే రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ దక్కుతోంది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కి ఈ మధ్య కాలంలో తెలుగులో ఫాలోయింగ్ బాగానే పెరిగింది.

మనమంతా, జనతా గ్యారేజ్ వంటి సినిమాలతో తెలుగులో కూడా మార్కెట్ పెంచుకున్నాడు. అతడు నటించిన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో విడుదలైన 'మన్యంపులి' సినిమా భారీ వసూళ్లను సాధించింది. తాజాగా అతడు నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే 'ఒడియన్'.

అతి సులువుగా రూపం మార్చుకోగలిగే ఒడియన్ అనే తెగకు చెందిన వ్యక్తిగా మోహన్ లాల్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈరోజు కేరళలో రికార్డ్ స్థాయిలో ఈ సినిమా విడుదలైంది. తమిళనాడులో కూడా సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ దాదాపు రూ.100 కోట్లు దాటేసింది. కేరళలో సుమారు వెయ్యి స్క్రీన్ లలో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ స్థాయిలో అక్కడ ఇప్పటివరకు ఏ సినిమా కూడా విడుదల కాలేదు. మోహన్ లాల్ అభిమానులు కేరళలో ఒక ప్రాంతంలో 130 అడుగుల మోహన్ లాల్ కటౌట్ ను పెట్టారు. ఇది ఇండియాలోనే రికార్డ్ అని చెబుతున్నారు. శ్రీకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Parasakthi: సంక్రాంతి ఫ్లాప్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోందా.. రిలీజ్ డేట్ ఇదేనా ?
రాజమౌళి సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్లు.. హీరోకి తీవ్ర అవమానం, కానీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్