'భైరవగీత'కి మిక్స్డ్ టాక్ వినిపిస్తోందే..!

Published : Dec 14, 2018, 10:50 AM IST
'భైరవగీత'కి మిక్స్డ్ టాక్ వినిపిస్తోందే..!

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన శిష్యుడు సిద్ధార్థ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. 'భైరవగీత' అనే సినిమాను నిర్మించాడు. ముందు నుండి ఈ సినిమాని వెరైటీ ప్రమోషన్స్ తో జనాల్లోకి వెళ్లేలా చేశాడు వర్మ. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన శిష్యుడు సిద్ధార్థ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. 'భైరవగీత' అనే సినిమాను నిర్మించాడు. ముందు నుండి ఈ సినిమాని వెరైటీ ప్రమోషన్స్ తో జనాల్లోకి వెళ్లేలా చేశాడు వర్మ. మంచి అంచనాల మధ్య శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ధనుంజయ, ఇర్రా మోర్ లు నటించిన ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషాల్లో విడుదలైంది. కన్నడలో ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో కూడా రెండు రోజుల ముందే సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. మీడియా సభ్యుల నుండి కూడా ఈ సినిమాకి పాజిటివ్ టాకే వినిపించింది.

కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరేమో దర్శకుడిది చిన్న వయసే అయినప్పటికీ రాయలసీమ బ్యాక్ డ్రాప్, లవ్ స్టోరీ బాగా డీల్ చేశాడని అంటుంటే మరికొందరు మాత్రం లిప్ లాక్ లు ఉంటే 'అర్జున్ రెడ్డి', 'ఆర్ ఎక్స్ 100' సినిమాల మాదిరి హిట్ అవుతుందని భావించి ఈ సినిమాలో కూడా లిప్ లాక్ సీన్లు పెట్టారని  విమర్శిస్తున్నారు.

ఎక్కువ మంది జనాలు మాత్రం ఈ సినిమాను పొగుడుతుండడంతో ఈ సినిమాకి హిట్ టాక్ రావడం ఖాయమని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. సినిమా అసలైన టాక్ ఏంటనే విషయం మాత్రం మరికొద్ది గంటల్లో తెలియనుంది!
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌