సుమ, అనసూయ, రష్మిల రెమ్యునరేషన్ ఎంతంటే..?

Published : Dec 14, 2018, 10:25 AM IST
సుమ, అనసూయ, రష్మిల రెమ్యునరేషన్ ఎంతంటే..?

సారాంశం

యాంకర్ గా టాప్ రేసులో దూసుకుపోతుంది సుమ. తనదైన మాటలు, పంచ్ లతో అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటుంది. యాంకరింగ్ లో బిజీగా ఉండడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. 

యాంకర్ గా టాప్ రేసులో దూసుకుపోతుంది సుమ. తనదైన మాటలు, పంచ్ లతో అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటుంది. యాంకరింగ్ లో బిజీగా ఉండడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది.

మరి ఈ టాప్ యాంకర్ కి ఎంత పారితోషికం వస్తుందని ఆరా తీయగా.. ఒక ఈవెంట్ కి రెండున్నర నుండి మూడు లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలిసింది. భారీ సినిమా ఈవెంట్స్ అంటే ఈ నంబర్ ఇంకాస్త పెరుగుతుందట. సుమ తరువాతి స్థానంలో యాంకర్ అనసూయ నిలుస్తోంది.

ఈమె బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా దర్శనమిస్తూ బిజీగా మారింది. 'జబర్దస్త్' షోలో స్కిన్ షో చేస్తూ యాంకర్లు కూడా హాట్ గా ఉండగలరంటూ నిరూపిస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ భామ ఒక్కో ఈవెంట్ కి రూ.2 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటుందట.

వీరిద్దరి తరువాత ఆ రేంజ్ పారితోషికం అందుకుంటోంది రష్మి. ఒక్కో ఈవెంట్ కి లక్షన్నర వరకు రెమ్యునరేషన్ దక్కుతుందట. ఇక బిగ్ బాస్ షోతో ఫేమస్ అయిన యాంకర్ శ్యామల ఒక ఈవెంట్ కోసం 50 వేల రూపాయల వరకు తీసుకుంటుందని తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే
అఖండ 2 లో బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్న నటి ఎవరో తెలుసా? ఐదుగురు హీరోయిన్ల ఏజ్ గ్యాప్ ఎంత?