ప్రధాన మంత్రిని ఎందుకు కలిశానంటే.. స్టార్ హీరో వ్యాఖ్యలు!

Published : Sep 22, 2018, 02:45 PM IST
ప్రధాన మంత్రిని ఎందుకు కలిశానంటే.. స్టార్ హీరో వ్యాఖ్యలు!

సారాంశం

ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు రాజకీయాల్లోకి వస్తుండడంతో ఏ హీరో రాజకీయ నాయకులతో కనిపిస్తున్నా.. అది కాస్త వైరల్ అవుతోంది. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిశారు. 

ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు రాజకీయాల్లోకి వస్తుండడంతో ఏ హీరో రాజకీయ నాయకులతో కనిపిస్తున్నా.. అది కాస్త వైరల్ అవుతోంది. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిశారు. దీంతో మోహన్ లాల్ బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి.

అంతేనా.. 2019 ఎన్నికల్లో ఆయన్ని తిరువనంతపురం నుండి బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారని రకరకాల వార్తలు వినిపించాయి. మోహన్ లాల్ రాజకీయాల్లోకి రావడం పట్ల ఆయన అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు  వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలో ఆయన ఈ వార్తలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ''ప్రధానమంత్రితో నేను భేటీ అయినప్పటి నుండి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. భారత పౌరుడిగా నేను ఎప్పుడైనా.. ప్రధానిని కలవొచ్చు.. ఈ భేటీలో ప్రధాని మోదీ రాజకీయాల గురించి నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు'' అని వెల్లడించారు.

కృష్ణాష్టమి సందర్భంగా మోహన్ లాల్ మోదీని కలిశారు. ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించడంతో ఆ ట్వీట్ వైరల్ అయింది. ఇప్పుడు మోహన్ లాల్ ఇచ్చిన వివరణతో ఇకపై ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు