Urfi Javed : ‘హిజాబ్ వివాదం’పై నటి ఉర్ఫీ జావేద్ కామెంట్స్.. నచ్చినది ధరించడం స్త్రీ హక్కు అంటూ..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 19, 2022, 04:40 PM ISTUpdated : Feb 19, 2022, 04:44 PM IST
Urfi Javed : ‘హిజాబ్ వివాదం’పై  నటి ఉర్ఫీ జావేద్ కామెంట్స్.. నచ్చినది ధరించడం స్త్రీ హక్కు అంటూ..

సారాంశం

సాహసోపేతమైన దుస్తులను ధరించడంలో ప్రసిద్ధి చెందింది బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్, నటి ఉర్ఫీ జావేద్ (Urfi Javed). అయితే కొద్ది రోజులుగా కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో మొదలైన ‘హిజాబ్ వివాదం’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.   


హిందీ సిరియల్స్ లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఉర్ఫీ జావేద్. ‘బడే బయ్యా కీ దుల్హానియా’, చంద్ర నంది, మేరీ దుర్గా, బే పన్నాహ, జీజీ మా, హే రిస్తా క్యా ఖేల్తా హే వంటి టెలివిజన్ సీరిస్ లో నటించింది. గతేడాది కరణ్ జోహార్ హోస్ట్ గా నిర్వహించిన ‘బిగ్ బాస్ ఓటీటీ’ కాంటెస్టెంట్ గా పాల్గొంది. కానీ పెద్ద అవకాశాలు అందండం లేదు ఈ యూపీ భామాకు. సోషల్ మీడియాలో మాత్రం స్కిన్ షోతో రచ్చ రచ్చ చేస్తోంది. ట్రెండీ వేర్, గ్లామర్ చూపించే అవుట్ ఫిట్ తో నెటిజన్లకు నిద్రపట్టనివ్వడం లేదు.

ఓ ఫొటో గ్రాఫర్  కర్ణాటకలోని ఉడిపిలో మొదలైన హిజాబ్ వివాదంపై ఉర్ఫీ జావేద్ అభిప్రాయాన్ని కోరాడు. కాలేజీల్లో మహిళా విద్యార్థులు ధరించే హిజాబ్ పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని సమర్థించింది. అది ఎలాంటి తప్పుగా భావించాల్సిన పనిలేదంటూ వెల్లడించింది. ‘కోరుకున్నది ధరించడం స్త్రీ హక్కు అని నేను చెప్పాలనుకుంటున్నాను’ అంటూ పేర్కొంది. హీందీ స్లోగన్ చెబుతూ  మహిళలు తమకు నచ్చినవి ధరించవచ్చు అని తెలిపింది. స్కూల్లో హిజాబ్ ధరించినా, అందులో పెద్ద విషయం ఏముందని, పార్లమెంటులో లేదా మరెక్కడైనా మీకు కావలసిన దుస్తులు ధరించగలిగినప్పుడు.. ఇది పెద్ద విషయం కాదని అభిప్రాయపడింది.  అనంతరం తన శరీరంపైన టాటూల గురించి కూడా మాట్లాడుతూ... తన మాజీ ప్రియడి పేరును పచ్చబొట్టు వేయించుకున్నానని తెలిపింది. ప్రస్తుతం దాన్ని దుస్తులతో కవర్ చేస్తున్నట్టు వెల్లడించింది. 

‘హిజాబ్’వివాదంపై జనవరిలో ప్రభుత్వ పీయూ కళాశాలలో హిజాబ్ ధరించిన ఆరుగురు విద్యార్థినులను తరగతి గదుల్లోకి రానివ్వ లేదు.  అనంతరం విద్యార్థులంతా కలిసి కళాశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ వివాదంపై  హైకోర్టులో కేసు నమోదైంది. హిజాబ్.. ఇస్లాం మతానికి అవసరమైన మతపరమైన ఆచారం కాదని, దాని ఉపయోగాన్ని నిరోధించడం మత స్వేచ్ఛకు హామీనిచ్చే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించదని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం హైకోర్టులో వాదించింది. మరోవైపు ‘హిజాబ్ ధరించడం ఇస్లాం మతంలో ముఖ్యమైన భాగం కాదని’కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాద్గీ, జస్టిస్ రీతు రాజ్ అవస్తి, జస్టిస్ జేఎం ఖాజీ, జస్టిస్ కృష్ణ ఎం దీక్షిత్‌లతో కూడిన హైకోర్టు ఫుల్ బెంచ్‌కు తెలిపారు. ఇందుకు స్పందించిన కోర్టు తీర్పు వెల్లడించేంత వరకు ఏ మతపరమైన దుస్తులు ధరించవచ్చని, ఘర్షణలకు కారకులు కాకూడదని సూచించింది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?