షూటింగ్ లో ప్రమాదం, పవన్ కళ్యాణ్ కు గాయాలు

Published : Oct 21, 2017, 09:07 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
షూటింగ్ లో ప్రమాదం, పవన్ కళ్యాణ్ కు గాయాలు

సారాంశం

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పీఎస్ పీకే షూటింగ్ లో స్వల్ప అపశృతి షూటింగ్ సందర్భంగా హీరో పవన్ కళ్యాణ్ కు గాయాలు పవన్ చేతికి బలమైన గాయం కావటంతో షూటింగ్ వాయిదా

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమా షూటింగ్‌ ప్రారంభమై చాలా రోజులైంది. ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉండటంతో సినిమా మీద కూడా అదే స్థాయిలో హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాను 2018 జనవరి 10న విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి ఫోటో ఇప్పటివరకు బయటికి రాకపోవడం విశేషం. అభిమానుల ఒత్తిడితో ఓ మ్యూజికల్ టీజర్ ను మాత్రమే  చిత్ర యూనిట్‌ రిలీజ్ చేసింది.

 

అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ కర్ణాటకలోని మంగుళూరు ఏరియాలో జరుగుతోంది. చిత్రీకరణ సమయంలో పవర్‌ స్టార్‌ ఎడమ చేతికి గాయమైందని సమాచారం. ప్రస్తుతం పవన్‌ చేతికి గాయమైన ఓ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చాలా రోజుల తరువాత పవన్‌ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్‌ వచ్చిందనే ఆనందం కన్నా... పవన్‌ చేతికి గాయం అవడంతో అభిమానులు కంగారు పడుతున్నారు.  

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Day 50 Collection: `బోర్డర్ 2` దెబ్బకు ధురంధర్ ఆట క్లోజ్, 50 రోజుల కలెక్షన్లు
Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే