గొప్ప వ్యక్తిని కోల్పోయాం.. బాపినీడు మృతిపై మోహన్ బాబు!

Published : Feb 12, 2019, 12:13 PM IST
గొప్ప వ్యక్తిని కోల్పోయాం.. బాపినీడు మృతిపై మోహన్ బాబు!

సారాంశం

ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు మృతిపట్ల సినీ నటుడు మంచు మోహన్ బాబు సంతాపం వ్యక్తం చేశారు. గొప్ప వ్యక్తిని కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు మృతిపట్ల సినీ నటుడు మంచు మోహన్ బాబు సంతాపం వ్యక్తం చేశారు. గొప్ప వ్యక్తిని కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విజయ బాపినీడు గారి మరణం తనను ఎంతగానో బాధించిందని అన్నారు.

ఆయనతో పరిచయం ఇప్పటిది కాదని, 1990 నుండి బాపినీడు గారితో పరిచయం ఉందని అన్నారు. తనకు అత్యంత సన్నిహితమైన వ్యక్తుల్లో విజయ బాపినీడు గారు ఒకరని చెప్పారు. మయూరి సంస్థలో పని చేస్తున్న రోజుల నుండి బాపినీడుతో తనకు సాన్నిహిత్యం ఉందని, ఎంతో  మృదుస్వభావం గల వ్యక్తి అని అన్నారు.

గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అని అన్నారు. అతడు మంచి దర్శకుడు మాత్రమే కాదని, అంతకుమించిన మంచి రచయిత, సంపాదకుడు, అభిరుచి గల నిర్మాత అని చెప్పారు.  ఆయన లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం తెలుగు సినిమా పరిశ్రమకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు. 

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కన్నుమూత!

 

PREV
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?