ఆ హీరోయిన్ సపోర్ట్ తో కాజల్ షాకింగ్ డెసిషన్!

Published : Feb 12, 2019, 11:51 AM IST
ఆ హీరోయిన్ సపోర్ట్ తో కాజల్ షాకింగ్ డెసిషన్!

సారాంశం

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న నటి కాజల్ అగర్వాల్ ఇప్పుడు నిర్మాతగా మారబోతుందని సమాచారం. కేఏ మూవీస్ అనే బ్యానర్ ని స్థాపించి సొంతగా సినిమాలను నిర్మించాలని భావిస్తోంది. 

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న నటి కాజల్ అగర్వాల్ ఇప్పుడు నిర్మాతగా మారబోతుందని సమాచారం. కేఏ మూవీస్ అనే బ్యానర్ ని స్థాపించి సొంతగా సినిమాలను నిర్మించాలని భావిస్తోంది. మొదటి సినిమాకు దర్శకుడిగా ప్రశాంత్ వర్మని సెలెక్ట్ చేసుకుంది.

అయితే ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే.. కాజల్ బ్యానర్ లో ఓ స్లీపింగ్ పార్టనర్ కూడా ఉంటుందట. ఆమె మరెవరో కాదు తమన్నా. ఇప్పటివరకు స్నేహితులుగా ఉన్న వీరు ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్స్ గా మారబోతున్నారు. త్వరలోనే తన బ్యానర్ కి సంబంధించిన విషయాలను అధికారికంగా ప్రకటించనుంది కాజల్.

గతంలో దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి 'అ!' సినిమాకు పని చేసింది కాజల్. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఓ కథకు సంబంధించిన చర్చలు జరిగాయి. దీంతో తానే నిర్మాతగా మారి సినిమాలో నటించడంతో పాటు నిర్మించడానికి సిద్ధమవుతోంది.

అయితే తన బ్యానర్ పై వరుస సినిమాలు చేస్తుందా లేదా ఈ ఒక్క సినిమాతో ఆగిపోతుందా..? అనే విషయాలపై క్లారిటీ లేదు. 

PREV
click me!

Recommended Stories

1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు
Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?