#మీటూ అనేది ఉద్యమమే కాదు.. అదొక వెర్రి: స్టార్ హీరో కామెంట్స్!

By Prashanth MFirst Published Nov 20, 2018, 6:12 PM IST
Highlights

గత కొంత కాలంగా మీటూ కి సంబందించిన వార్తలు ఏ రేంజ్ లో వస్తున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎప్పుడు లేని విధంగా సౌత్ లో చాలా మంది నటీనటులు ఇతర స్టార్స్ పై ఊహించని విధంగా లైంగిక ఆరోపణలు చేశారు.

గత కొంత కాలంగా మీటూ కి సంబందించిన వార్తలు ఏ రేంజ్ లో వస్తున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎప్పుడు లేని విధంగా సౌత్ లో చాలా మంది నటీనటులు ఇతర స్టార్స్ పై ఊహించని విధంగా లైంగిక ఆరోపణలు చేశారు. ఈ విషయంలో చాలా మందికి మద్దతు లభించింది. అలాగే కొంత మంది ఆరోపణలను కొట్టిపారేశారు. 

అయితే ఇప్పుడు మీటూ ఉద్యమంపై మలయాళం స్టార్ యాక్టర్ మోహన్ లాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జీరో స్టార్ అనిపించుకుంటున్నారు.  మలయాళంలో నటి కిడ్నాప్ కేసులో దిలీప్ ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంలో దిలీప్ కు మోహన్ లాల్ మద్దతుగా నిలిచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోసారి మహిళలపై గౌరవం లేకుండా మీటూ ఉద్యమంపై కామెంట్స్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. . 

ప్రస్తుతం దుబాయ్ లో కేరళ వరద బాధితుల సహాయార్ధం స్టార్స్ విరాళాలు సేకరించే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్ లో మోహన్ లాల్ మీటూ ఒక వెర్రి ఉద్యమం అన్నట్లు స్పందించారు. అసలు అది ఉద్యమమే కాదని, స్టార్స్ వేధించారంటూ ఆరోపణలు చేయడం ఫ్యాషన్ గా మారిందని అన్నారు. 

అదే విధంగా మీటూ అనే విషయాన్నీ ఒక ఉద్యమంగా పరిగణించలేనని చెబుతూ దాని వల్ల మలయాళం ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని, లైంగిక వేధింపులు అనేవి సినిమా ఇండస్ట్రీలోనే జరుగుతున్నాయని చెప్పడం కరెక్ట్ కాదని మోహన్ లాల్ తన వివరణను ఇచ్చారు. దీంతో ఆయన మాట్లాడిన విధానంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. 

click me!
Last Updated Nov 20, 2018, 6:12 PM IST
click me!