సిరివెన్నెల కడసారి చూపుకు నోచుకోలేకపోయిన మంచు ఫ్యామిలీ, కారణం ఇదే.. మోహన్ బాబు ఎమోషనల్

pratap reddy   | Asianet News
Published : Dec 05, 2021, 11:28 AM IST
సిరివెన్నెల కడసారి చూపుకు నోచుకోలేకపోయిన మంచు ఫ్యామిలీ, కారణం ఇదే.. మోహన్ బాబు ఎమోషనల్

సారాంశం

లెజెండ్రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి నవంబర్ 30న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన సిరివెన్నెల తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. 

లెజెండ్రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి నవంబర్ 30న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన సిరివెన్నెల తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సిరివెన్నెల చిత్రం మొదలుకుని దాదాపు 3 వేలకు పైగా పాటలు రచించారు సిరివెన్నెల. 

Sirivennela Seetharama Sastry మరణించడంతో టాలీవుడ్ ప్రముఖులంతా ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని ఇలా టాప్ హీరోలంతా సిరివెన్నెల నివాళులు అర్పించారు. 

సిరివెన్నెల నివాళులు అర్పించడానికి కానీ, అంత్యక్రియలకు కానీ మంచు ఫ్యామిలీ హాజరు కాలేదు. అంతటి లెజెండ్రీ లిరిసిస్ట్ మరణించినప్పటికీ మంచు ఫ్యామిలీ హాజరు కాకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా మంచు విష్ణు బాధ్యతాయుతమైన 'మా ' అధ్యక్ష పదవిలో ఉన్నాడు. 

తన ఫ్యామిలీ నుంచి ఎవరూ సిరివెన్నెల అంత్యక్రియలకు హాజరు కాకపోవడానికి గల కారణాలని Mohan Babu వివరించారు. మోహన్ బాబు మాట్లాడుతూ.. 'సిరివెన్నెల మృతితో ఇండస్ట్రీ పెద్ద దిక్కుని కోల్పోయింది. ఇటీవల నా సొంత తమ్ముడు మరణించాడు. సిరివెన్నెల మరణించిన రోజే మా తమ్ముడి పెద్ద కర్మ జరిపించాం. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ బయటకు వెళ్లకూడదు. సిరివెన్నెలని కడసారి చూడాలని ఉన్నా వెళ్లలేని పరిస్థితి. అందుకే తన కుటుంబ సభ్యులు ఎవరూ సిరివెన్నెల అంత్య క్రియలకు హాజరు కాలేదని మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు. 

చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది అని మోహన్ బాబు అన్నారు. సిరివెన్నెల తన కెరీర్ లో 11 నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. సిరివెన్నెల, గాయం, శుభలగ్నం, సింధూరం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. 

Also Read: Pushpa: పుష్పలో అతడిని చంపేది అనసూయేనా.. షాకింగ్ ట్విస్ట్, కిల్లర్ లేడీగా..

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్