రాజస్థాన్ లో అత్యంత వైభవంగా కత్రినా-విక్కీ వివాహం... అతిథుల లిస్ట్ లో కోహ్లీ, అనుష్క శర్మ

Published : Dec 05, 2021, 09:00 AM ISTUpdated : Dec 05, 2021, 09:03 AM IST
రాజస్థాన్ లో అత్యంత వైభవంగా కత్రినా-విక్కీ వివాహం... అతిథుల లిస్ట్ లో కోహ్లీ, అనుష్క శర్మ

సారాంశం

బాలీవుడ్ క్రేజీ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లికి సిద్ధమయ్యారు. వీరి వివాహానికి రాజస్థాన్ లోని రాన్తంబోర్ వేదిక కానుంది. బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్న ఈ పెళ్లి వేడుక విశేషాలు ఆసక్తి రేపుతున్నాయి.   

యంగ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal) - కత్రినా చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. తమ రిలేషన్ పై అధికారికంగా స్పష్టత ఇవ్వని ఈ జంట... చర్యల ద్వారా లోకానికి తెలియజేశారు. విందులు, విహారాలలో కలిసి పాల్గొంటూ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. మీడియా కథనాలపై ఎప్పుడూ స్పందించిన ఈ జంట సడన్ గా పెళ్ళికి సిద్దమైనట్లు కథనాలు వెలువడ్డాయి. తమ వెడ్డింగ్ డ్రెస్సెస్ కోసం ఓ ప్రముఖ డిజైనర్ ని కలవడంతో పెళ్లి వార్తలకు బలం చేకూరింది. 

Also read Deepika Padukone:ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. చీరా సారె తో దీపికాకు వెల్కమ్ చెప్పిన టీమ్!
ఇక కత్రినా (Katrina Kaif)- విక్కీ పెళ్లి వేడుకకు రాజస్థాన్ లోని రాన్తంబోర్ వేదికైంది. డిసెంబర్ 6నుండి అక్కడ పెళ్లి వేడుకలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి కావడం జరిగింది. డిసెంబర్ 6 నుండి 9 వరకు పెళ్లి వేడుక నిర్వహించనున్నారు. 10వ తేదీన కూడా అత్యంత సన్నిహితుల మధ్య చిన్న వేడుక నిర్వహించనున్న నేపథ్యంలో నూతన వధూవరులు రాజస్థాన్ లోనే ఉంటారట. అనంతరం ముంబై తిరిగి వస్తారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. 

Also read `మేడమ్‌ యాటిట్యూడ్‌ తగ్గించుకోండి`.. జాన్వీ కపూర్‌పై నెటిజన్ల దారుణంగా ట్రోలింగ్‌..
ఇక ఈ పెళ్లి ( Katrina Kaif- Vicky Kaushal wedding)వేడుకకు బాలీవుడ్ కి చెందిన టాప్ సెలెబ్రిటీలు హాజరుకానున్నారు. ఈ లిస్ట్ లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఉండడం విశేషం. ప్రస్తుతం విరాట్ న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో పాల్గొంటున్నారు. సెకండ్ టెస్ట్ నేడు లేదా రేపు ముగియనుంది. మ్యాచ్ ముగిసిన వెంటనే అనుష్క-విరాట్ రాజస్థాన్ చెక్కేస్తారట. కాగా బాలీవుడ్ బాద్షా షారుక్ కూడా ఈ వివాహానికి హాజరు కావాల్సి ఉండగా... విరమించుకున్నట్లు సమాచారం. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:కాశీతో స్వప్నగొడవ-ఇంట్లో నుంచి పొమ్మన్న కావేరి-దీపపై నిందేసిన కాంచన
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్, మోక్షజ్ఞ సినిమాకు న్యూ ఇయర్ లో మోక్షం, డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?