దాసరి ఆస్తి వివాదంపై మోహన్ బాబు కామెంట్స్!

Published : May 07, 2019, 09:35 AM IST
దాసరి ఆస్తి వివాదంపై మోహన్ బాబు కామెంట్స్!

సారాంశం

కొన్ని కారణాల వలన దర్శకరత్న దాసరి నారాయణరావు కుటుంబంలో ఆస్తి వివాదాలను పరిష్కరించలేకపోయానని దాసరి శిష్యుడు, ప్రముఖ నటుడు మోహన్ బాబు అన్నారు. 

కొన్ని కారణాల వలన దర్శకరత్న దాసరి నారాయణరావు కుటుంబంలో ఆస్తి వివాదాలను పరిష్కరించలేకపోయానని దాసరి శిష్యుడు, ప్రముఖ నటుడు మోహన్ బాబు అన్నారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో దాసరి  లఘు చిత్రాల బహుమతి ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి నటులు జయసుధ, ఆర్.నారాయణమూర్తితో పాటు మోహన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షార్ట్ ఫిలిం పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులను పలువురు నిరుపేద విద్యార్ధులకు స్కాలర్ షిప్ లను అందించారు. 

ఈ సందర్భంగా మోహన్ బాబు దాసరి గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. దాసరి వీలునామాలో తనతో పాటు మురళీమోహన్ పేరు రాసి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారని, కానీ అది కొంతవరకు సాధ్యం కాలేదని అన్నారు. 

తన మావయ్య దాసరి ఆస్తి పంపకాల్ని మోహన్ బాబు చేతుల్లో పెట్టారని ఇటీవల ఆయన కోడలు సుశీల అన్నారు. ఈ విషయంలో మోహన్ బాబు తమకు అన్యాయం చేశారని కూడా  ఆమె ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్