కీరవాణి తరువాత రాజమౌళి చేతిలో అతనే?

Published : May 06, 2019, 08:47 PM IST
కీరవాణి తరువాత రాజమౌళి చేతిలో అతనే?

సారాంశం

  టాలీవుడ్ మోస్ట్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ట్రెండ్ కి తగ్గట్టు ఫాలో అవుతారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రాజమౌళి ఎలాంటి సినిమా చేసిన అందుకు తగ్గట్టుగా మ్యూజిక్ ఇవ్వడం ఆయనకొక్కరికే సాధ్యం.

టాలీవుడ్ మోస్ట్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ట్రెండ్ కి తగ్గట్టు ఫాలో అవుతారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రాజమౌళి ఎలాంటి సినిమా చేసిన అందుకు తగ్గట్టుగా మ్యూజిక్ ఇవ్వడం ఆయనకొక్కరికే సాధ్యం. బాహుబలి అనంతరం రెస్ట్ తీసుకుంటాను అని చెప్పిన కీరవాణి జక్కన్న RRR కోసం మళ్ళీ మ్యూజిక్ చేస్తున్నాడు. 

అయితే ఫైనల్ గా ఇప్పుడు కొడుకు కాల భైరవను రంగంలోకి దింపి రాజమౌళి కోసం అతన్ని మారుస్తున్నట్లు తెలుస్తోంది. కాల భైరవ ఇప్పటికే అంతరిక్షం అనే సినిమాకు మ్యూజిక్ చేస్తున్నాడు. కీరవాణి సపోర్ట్ తోనే ఈ అఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ నిఖిల్ - చందు మొండేటి కాంబోలో తెరకెక్కనున్న కార్తికేయ సీక్వెల్ కి కూడా కాల భైరవ మ్యూజిక్ అందించేలా కీరవాణి సపోర్ట్ చేసినట్లు సమాచారం. 

కాల భైరవ ఇప్పటికే సింగర్ గా క్లిక్కయ్యాడు. ఇక మ్యూజిక్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. అలా క్రేజ్ తెచ్చుకుంటే రాజమౌళి ఆలోచనలో పడ్డట్లే. అందుకే కీరవాణి సైతం కొడుకుకి మంచి షేప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తాను రెస్ట్ తీసుకొని రాజమౌళికచేతిలో కొడుకును పెట్టేయాలను అనుకుంటున్నట్లు టాక్. మరి జక్కన్న ఆలోచనలలు కాల భైరవ ఎంతవరకు సెట్టవుతాడో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

చెప్పి మరీ ఏఎన్నార్ రికార్డులు చెల్లా చెదురు చేసిన సూపర్ స్టార్ కృష్ణ.. శ్రీదేవిని తప్పించాల్సిందే అంటూ
మహేష్ బాబు ను హీరోయిన్ ఎంగిలి తాగమన్న దర్శకుడు, కోపంతో షూటింగ్ నుంచి వెళ్లిపోయిన సూపర్ స్టార్..