తారక్ - చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

Published : May 06, 2019, 09:06 PM IST
తారక్ - చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

సారాంశం

  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం RRR. రీసెంట్ గా సినిమా షెడ్యూల్ సడన్ గా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మొదట రామ్ చరణ్ జిమ్ లో వర్కౌట్ చేస్తూ చిల మండల గాయానికి గురి కావడంతో షూటింగ్ పోస్ట్ పోన్ చేశారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం RRR. రీసెంట్ గా సినిమా షెడ్యూల్ సడన్ గా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మొదట రామ్ చరణ్ జిమ్ లో వర్కౌట్ చేస్తూ చిల మండల గాయానికి గురి కావడంతో షూటింగ్ పోస్ట్ ఫోన్ చేశారు. ఈ విషయం అందరికి తెలిసిందే. 

అయితే రెండు వారాల్లో మొదలెడతామని అనుకునేలోపే ఊహించని విధంగా జూనియర్ ఎన్టీఆర్ కి కూడా చేతికి గాయమయ్యింది. మొత్తంగా ఒక నెల వరకు అనుకున్న షెడ్యూల్ క్యాన్సిల్ అవ్వడంతో సినిమా వచ్చే ఏడాది జులై 30న చెప్పిన టైమ్ కి వస్తుందా రాధా? అని ఇరు వర్గాల ఫ్యాన్స్ కొంత ఆందోళనకి గురయ్యారు. ఎందుకంటే రాజమౌళి ఈ సినిమా కోసం కరెక్ట్ ప్లాన్ రెడీ చేసుకున్నాడు. 

అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగితేనే సినిమా ఆ డేట్ కి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సమయం ఏ మాత్రం వృధా అయినా మళ్ళీ రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉంటుంది. కానీ హీరోలిద్దరు ఒకేసారి గాయాలపాలవ్వడం ఆందోళనను కలిగించింది. ఫైనల్ గా ఇప్పుడు హీరోలు కోలుకోవడంతో త్వరలోనే షెడ్యూల్ ని రీ స్టార్ట్ చేయడానికి జక్కన్న టీమ్ సిద్ధమవుతోంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతమందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్